Posted by: nagamurali | January 12, 2012

కుమారి? శ్రీమతి?

ఫ్రాన్సులో మన ‘కుమారి’ లేదా ‘మిస్’ కి సమానార్థకమైన మేడమొజెల్ (mademoiselle) అన్న పదాన్ని నిషేధించాలని గొడవ చేస్తున్నార్ట. http://www.bbc.co.uk/news/magazine-16503341

మనం కూడా ‘కుమారి’ అన్న పదాన్ని వదిలేసుకుంటే ఆడవాళ్ళందర్నీ శ్రీమతి అనొచ్చా అని ఓ సందేహం కలుగుతోంది. శ్రీమతి అంటే పెళ్ళయిన స్త్రీ అని ఓ అర్థం స్థిరపడిపోయింది కానీ, నిజానికా పదానికి అటువంటి అర్థం ఏమీ లేదు. అయినా స్థిరపడిపోయిన అర్థాన్ని ఎలా చెరిపేసుకుంటాం అంటే, ‘మతి’ తీసేసి ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ కూడా ఒట్టి ‘శ్రీ’ తగిలిస్తే ఎలా ఉంటుంది? వ్యాకరణమంటారా? ఈ రోజుల్లో అదెవడిక్కావాలండీ? ఇదివరకు ‘ఈ‍ టీవీలో శ్రీ భాగవతం వస్తోం’దంటే, ‘అదేంటి శ్రీమత్ భాగవతం అనాలి కదా’ అంటే, ‘నీదో చాదస్తం’ అన్నారు జనాలు.

కాబట్టి ఫెమినిస్టులారా, ఆడవాళ్ళందర్నీఫ్రాన్సులో లాగా మేడమ్ అని పిలవాలనీ, లేకపోతే మిసెస్ అన్న పదాన్ని తొలగించి అందర్నీ మిస్ అనే పిలవాలనిగానీ, చాదస్తులైతే ‘శ్రీ’ అని మాత్రమే సంబోధించాలనీ (ఉత్తరాదిలోలా ‘సుశ్రీ’ అయినా పరవాలేదు), (మాకు మంచి కాలక్షేపం కలిగేలాగా) మీరంతా ఉద్యమం లేవదియ్యాలనీ మా విజ్ఞప్తి.

If you are offended by the ‘కాలక్షేపం’ remark, please read: http://www.independent.co.uk/opinion/commentators/agn232s-poirier-there-is-an-alternative-to-the-m-word-2362482.html

Advertisement

Responses

  1. అయ్యా, ఆడవారికి ’మతి’ అక్ఖర్లేదని అనడం అంత మంచిది కాదేమో చూడగలరు. వారి కా మాట అప్రియం కాగలదని నాకు తోస్తోంది. (నబ్రూయాత్ సత్యమప్రియం అన్న మాట తమకు తెలీనిది కాదు)

    అయితే గియితే శ్రీమతిని తీసెయ్యాలిగానీ, కుమారిని తీసెయ్యమని గోల చెయ్యడమెందుకూ..!!?
    ఈ పరాసు దొరసానుల గోల కొంత తికమకగా అనిపించడంలేదూ?

  2. మగవారికి ఎలానూ మతి లేదు, ఆడవారికి కూడా మతి తీసేస్తే ఎలా
    కాముధ

  3. అబ్బాయి.. నాగ మురళీ..మీ వ్యాఖ్యకి నేను తీవ్రంగా నిరసిస్తున్నాను. మహిళామణులు అందరు చేస్తున్నవి కాలక్షేపపు ఉద్యమాలా?హైటెక్ ఉద్యమాలు అని అన్నా ఒక వర్గం వారు చేసే ఉద్యమాలు కాలక్షేపు ఉద్యమాలు అనుకుని నవ్వుకోవచ్చును, సామాజిక ఉద్యమాలు చేసేవారిని..కించ పరచినట్లు లేదు. శ్రీ మతి అన్నా, కుమారి అన్నా మేడం అన్నా పురుషులు ఇచ్చే గౌరవమే కానీ.. స్త్రీల గౌరవం పురుషుల గౌరవం కాదా .. కాకుండా పోతుందా ఏమిటీ ..చెప్పండి.!?

  4. అన్ని ఉద్యమాలూ కాలక్షేపం ఉద్యమాలని నేనెక్కడన్నానండీ?? ఆ వాక్యం కిందనే మరొక ఆర్టికల్ లింకు కూడా ఇచ్చాను అందుకనే… నన్ను అపార్థం చేసుకుంటారనే…

    చదువరి, కాముధ ‍ – నెనర్లు, :-)

  5. నాగ మురళీ వారు,

    ఐరోపా కుమారీలు కౌమారత్వాన్ని కోల్పోవడానికి సిద్ధం గాని, శ్రీ మతి అవనే అవమని భీష్మించు కున్నా రండీ. కాబట్టి మిస్సు, మిస్సేస్సు కస్సు మిస్సు వారికీ చెల్లు.

    ఈ తెలుగు, భారతీయ నారీ కుమారీ మతి వున్న వారు ! వీరు శ్రీ మతీ శ్రీ మంతులు , సిరి మంతులు ! కాబట్టి శ్రీ మతీ ని వదలరను కుంటాను ! ఆ మధ్య ఒకావిడ పేరు శ్రీమతీ కుమారీ అని ఎక్కడో చదివాను !

    చీర్స్
    జిలేబి.

  6. మీకు కూడా సంక్రాంతి సుభాకాంక్షలండి

  7. శ్రీ జిలేబి గారు, నెనర్లు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
    భాస్కర్ గారు, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  8. నాగ మురళీ వారు,

    మీరు శ్రీ జిలేబి అని సంబోధించి మతి ని లాగేసుకున్నారు !

    సంక్రాంతి శుభాకాంక్షల తో

    చీర్స్
    జిలేబి.

  9. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో పులిని చూసి నక్క వాతపెట్టుకోవడం ప్రస్తావించి అవహేళన చేసేవాణ్ణి। కానీ ఇక్కడ పరిస్థతి ఊరపందిని చూసి ఐరావతం బురదలో ద్రొల్లిన చందానవుంది।

  10. రాకేశ్వరా, :-) :-)

  11. @నాగ మురళీ గారు,

    శంకరాభరణం మాష్టారు శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం తెలుగు తర్జుమా కి ప్రయత్నిస్తున్నారు. ఒక మారు వారి బ్లాగ్ టపా చూసి మీరేమైనా ఒక చేయి వేయగల వారా చూడ గలరా దయచేసి ?

    చీర్స్
    జిలేబి.

  12. నాగమురళి గారూ,
    ‘జిలేబీ’ గారి వ్యాఖ్య చూసారు కదా! ‘రామకృష్ణ విలోమకావ్యాన్ని’ తెలుగు లిపిలో నిన్న నా బ్లాగులో ప్రకటించాను. దానికి తెలుగు వ్యాఖ్యానం కోసం ప్రయత్నిస్తున్నాను. జిలేబీ గారన్నట్టు తెలుగు తర్జుమా’ కాదు,
    ఒకసారి నా బ్లాగు వీక్షించి ఆ కావ్యానికి తెలుగు వ్యాఖ్యానం కోసం సహకరించగలరా?
    “శంకరాభరణం’ – http://kandishankaraiah.blogspot.com
    h

  13. జిలేబిగారు / శంకరయ్యగారు,

    మీ అభిమానానికి కృతజ్ఞతలు. సంస్కృతంలో నాకు పాండిత్యమేమీ లేదండీ. ఆసక్తీ, సరళమైన భాషనీ, కావ్యాలనీ అర్థం చేసుకోగల జ్ఞానమూ ఉన్నాయి గానీ, ప్రౌఢకావ్యాలని అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు.

    అదీగాక నేను ప్రస్తుతం ఆఫీసు పనిమీద లండన్ లో ఉన్నాను. వీలు చూసుకుని ఈ కావ్యానికి ఎక్కడైనా వివరణ దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. DLI లో దొరకొచ్చు బహుశా. చూద్దాము.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.