Posted by: nagamurali | December 15, 2011

Sad day

ఆఫీసునుంచి రాగానే తెలిసిన వార్త. మా సంస్కృతం లెక్చరరుగారు హఠాత్తుగా దేహాన్ని విడిచారట. మూడు రోజులైందట.

స్వాయత్తమేకాన్తహితం విధాత్రా వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః
విశేషతః సర్వవిదాం సమాజే విభూషణం మౌనమపండితానామ్ ||

ఇదీ ఆవిడ మాకు చెప్పిన మొదటి క్లాసులో మొదటి పాఠం. రెండు క్లాసులపాటు ఇదే శ్లోకాన్ని వివరిస్తూపోయారు. ప్రతి పదాన్నీ విడదీసి, అర్థాలు, విశేషాలు ఎన్నో…  మొదటి క్లాసులోనే శ్లోకం నోటికొచ్చేసింది. అంతకుముందు ఒక్కముక్క కూడా సంస్కృతం ఎరగను, ఏదో ఇంట్లో పూజలో చదివే స్తోత్రాలు తప్ప. వాటికీ అర్థాలేమీ తెలియవు.

సంస్కృతం. ఇప్పటికీ నాకొచ్చిందీలేదు, పెట్టిందీ లేదు. ఆ టీచరుగారు చెప్పిన నాలుగు ముక్కలూ తప్ప నేను నేర్చుకున్నదీ లేదు, ఏమీ చేసిందీ లేదు.ఆ భాషతో ఏదో గట్టి పూర్వజన్మ అనుబంధం. ఆ పూర్వసంస్కారం బయటపడడానికి దోహదం చేశారావిడ, ఎంచేతనో…

When she was teaching us, she didn’t know that she was lighting a lamp. And she didn’t know that that lamp was to serve no purpose, that it was utterly useless.

ప్రసాదో నిష్ఫలో యస్య, యస్య కోపః నిరర్థకః – కొన్ని జీవితాలంతే. లోపల ఉన్న బీజాలు బయట పడి మొలకలెత్తవు. గానుగెద్దు జీవితాలు.

I hated studies. I hated college. The only exception was Sanskrit.

I was very depressed at that time. Probably I would have ended my life if I did not have that little light called Sanskrit in my life at that time.

I was regularly irregular in every other class. Sanskrit class was the only exception. Even if I was absent in college for the whole day, I would still go to college only for Sanskrit class. I used to read ahead and prepare myself for the class.

మా నాన్నగారితో అనేవారు, ‘మీవాడు నా సబ్జక్టుకి న్యాయం చేస్తాడుగానీ, కాస్త మిగతావి కూడా చదవమని చెప్పండీ’ అని.

ఇంటర్నల్ ఎక్జామ్స్ లో ఓసారి సంస్కృతం పేపర్ని సంస్కృత భాషలోనే ఆన్సర్ చేస్తే, ఆవిడ అన్నారు, ‘ఇంతవరకు నా సర్వీసులో నీలాంటి స్టూడెంటు నాకు దొరకలేదు, ఇహ ముందు దొరుకుతారని ఆశ లేదు’ అని.

క్లాసులో ఆవిడ అందర్నీ నెంబర్లు పెట్టి పిలిచి, నుంచోబెట్టి ప్రశ్నలడిగేవారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతే, ‘55, చెప్తావా?’ అనేవారు. 55 ఎవరో చెప్పక్కర్లేదనుకుంటా.

ఆవిడ రిటైరైనప్పుడు లండన్ నుంచి ఫోన్ చేశా. ‘మేడం గారూ, ఈరోజు నేను సౌందర్యలహరి శ్లోకాలు చదువుకుంటూ పారవశ్యం చెందుతున్నానంటే అది మీ చలవేనండీ. మీరు నేర్పిన విద్య నాకు ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదండీ’ అన్నాను. ఆవిడ ఎంతో సంతోషంతో తనకి జరిగిన సన్మానసభలో నా మాటలు చెప్పారట.

మా పెద్దమ్మాయి పుట్టడానికి ముందు మా శ్రీమతికి సీమంతం జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చారు. ‘మేడం గారూ, మాకు కాళిదాసు పుట్టాలని ఆశీర్వదించండీ’ అన్నాను సరదాగా. ‘లేదు, మా మురళీలాంటివాడే పుట్టాలని ఆశీర్వదిస్తాను’ అన్నారు.

వ్యతిషజతి పదార్థానన్తరః కో2పి హేతుః
న ఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయన్తే
వికసతి హి పతంగస్యోదయే పుణ్డరీకం
ద్రవతి చ హిమరశ్మావుద్గమే చన్ద్రకాన్తః ||

మేడంగారూ, నా లోపలి జీవితానికి కొంత వెలుగు ఇచ్చినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు. మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోగలిగే సామర్థ్యం నాకు లేకపోయింది. కనీసం వచ్చే జన్మలోనైనా నిజమైన కృషి చేస్తా.

Advertisement

Responses

  1. అప్రయత్నంగా కంట నీరు తిరిగింది.

  2. Heart touching…

  3. చిన్నప్పుడు పాఠాలు మప్పిన ఉపాధ్యాయులని ఎప్పటికీ మరిచిపోలేం. చివరి రోజుల్లో ఆమెకు మనశ్శాంతి ఉందని అనుకుంటూ, నా నమస్కారాలను అర్పిస్తున్నాను.

  4. ఇలాంటివి పోస్ట్ చేసి మమ్మల్ని ఏడిపించడానికి మీకు ఎవరిచ్చేరు అధికారం నెంబర్ 55?

    ప్రతీజీవీ ఏదో ఒక కారణం మూలానే పూర్తిగా బతకవల్సి వస్తోంది. అలా నేను బతకనూ అనడానికి అధికారం లేదు. ఆ జీవి బతికి బట్ట కట్టడానికి భగవంతుడు కోటానుకోట్ల ప్రయత్నాలు చేసి తీరుతాడు. శివానంద సరస్వతి గారు చెప్పినట్టు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి జీవి మనం పై మెట్టు ఎక్కడానికే భగవంతుడు పంపుతాడు. కోటి మందిలో ఒకడికి దొరికే భాగ్యం మీకు దొరికింది. అర్ధం మాట అటుంచి అసలు ఈ పద్యాలు సరిగ్గా చదవగలిగే తెలుగు వాళ్ళెంతమంది ఈ రోజుల్లో?

    గుండెకాయ మెలిపెట్టేసారు.

  5. మీరు అదృష్టవంతులు అటువంటి గురువు లభించినందుకు.

  6. ఎవరండీ? కొల్లూరి లక్ష్మిగారివద్ద నేను కూడా చదువుకున్నాను. ఆవిడ కాదు కదా?

  7. రాఘవ, ఆవిడేనండీ…

  8. మురళిగారూ,
    మీరు కన్నీళ్ళు తెప్పించారు. అయితే అవి ఆనందభాష్పాలు మాత్రమే. మనలోని దీపాన్ని వెలిగించిన గురువుని జీవితకాలం స్మరించుకోవడం కంటే గొప్ప సంస్కారమేముంటుంది? మీ సంస్కృతం టీచరు ఒక ప్రతీక మాత్రమే. మీ రచన చదువుతున్నంతసేపూ, ఎవరిమట్టుకు వాళ్లకి వాళ్ళ ప్రియమైన గురువులు మనసులో మెదిలే ఉంటారని నా విశ్వాసం.
    ఇంత చక్కని పోస్టు వేసినందుకు హృదయపూర్వక అభినందనలు.

  9. మురళీ! ఈ వార్త విన్నాక నాకు వెంటనే నువ్వే గుర్తుకొచ్చావ్. ఆవిడకి నీకూ గల అనుబంధం నేను కళ్ళారా చూశాను కాబట్టి నీకు ఎంత బాధ కలిగిందో నాకు తెలుసు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.