Posted by: nagamurali | December 11, 2011

అంత పొడుగూ కాదు, పొట్టీ కాదు

సమః సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః

ఆయన దేహము అంత పొడుగూ కాకుండా, పొట్టీ కాకుండా సమంగా ఉంటుంది. (మరో రకంగా చెప్పుకుంటే, square built.) ఆయన అవయవాలన్నీ హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉంటై. ఆయన రంగు నలుపు.

చతుష్కలః చతుర్లేఖః చతుష్కిష్కుః చతుస్సమః

ఆయన బొటనవ్రేలిపై నాలుగు రేఖలున్నాయి. నుదుటిపై (పాదాలపైనా, అరచేతులపైనా కూడా) నాలుగు రేఖలు ఉన్నాయి. ఆయన పొడవు తొంభై ఆరు అంగుళాలు, అంటే ఎనిమిది అడుగులు. ఆయన నాలుగుజతల అవయవాలూ సమానంగా ఉంటాయి.

Advertisement

Responses

  1. రాముడా?!

  2. అవునండీ, రాముడే. పై శ్లోకాలు సుందరకాండలో హనుమంతుడు రాముడి రూపాన్ని వర్ణిస్తూ చెప్పినవి.

  3. బాగుంది

  4. ఈ ౯౬ అంగుళాల విషయం ఎక్కడుంది?

  5. చతుష్కిష్కుః అన్నాడు కదా. అంటే నాలుగు కిష్కువుల (పొడవు) వాడు అని. కిష్కువు అంటే ఇరవై నాలుగు అంగుళాలుట. నాలుగు కిష్కువులూ తొంభై ఆరు అంగుళాలు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.