ఇవాళ కొన్ని మంచి చంద్రవర్ణన శ్లోకాలు చదివాను. వాటిలో కొన్ని రసవత్తరంగానూ, హాస్యస్ఫోరకంగానూ అనిపించినై, అందుకే ఈ టపా.
తతస్స మధ్యంగతమంశుమన్తమ్
జ్యోత్స్నావితానం మహదుద్వమన్తమ్
దదర్శ ధీమాన్ భువి భానుమన్తమ్
గోష్ఠే వృషం మత్తమివ భ్రమన్తమ్ ||
తరవాత ఆ ధీమంతుడు గొప్ప వెన్నెల కురిపిస్తూ చంద్రుడు ఆకాశ మధ్యానికి రావడం చూచాడు. ఆ చంద్రుడు ఆవుల మంద మధ్యలో మదించి తిరుగుతున్న ఆంబోతులాగా ఉన్నాడు.
లోకస్య పాపాని వినాశయన్తమ్
మహోదధిం చాపి సమేధయన్తమ్
భూతాని సర్వాణి విరాజయన్తమ్
దదర్శ శీతాంశుమథాభియాన్తమ్ ||
ఆకాశంలో తిరుగుతున్న ఆ చంద్రుడు లోకాల పాపాలు పోగొట్టేవాడు, సముద్రాన్ని వృద్ధిచేసేవాడు, సమస్త భూతకోటినీ ప్రకాశింపచేసేవాడు.
యా భాతి లక్ష్మీర్భువి మందరస్థా
తథా ప్రదోషేషు చ సాగరస్థా
తథైవ తోయేషు చ పుష్కరస్థా
రరాజ సా చారు నిశాకరస్థా ||
ఆ చంద్రుని శోభ – మందర పర్వతం పైన ప్రకాశించే శోభ; సాయం సమయంలో సముద్రుని శోభ; సరస్సులోని కమలాల శోభ.
హంసో యథా రాజతపంజరస్థః
సింహో యథా మందరకందరస్థః
వీరో యథా గర్విత కుంజరస్థః
చంద్రో2పి బభ్రాజ తథాంబరస్థః ||
వెండి పంజరంలో కూచున్న హంసలాగా, మందర పర్వత గుహలో ఉన్న సింహంలాగా, మదించిన ఏనుగునెక్కిన వీరుడిలాగా చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు.
స్థితః కకుద్మానివ తీక్ష్ణశృంగో
మహాచలశ్శ్వేత ఇవోచ్చశృంగః
హస్తీవ జామ్బూనదబద్ధ శృంగః
రరాజ చంద్రః పరిపూర్ణ శృంగః ||
వాడియైన కొమ్ములు కలిగిన ఎద్దులాగా, ఎత్తైన శిఖరాలు కలిగిన హిమాలయంలాగా, దంతములయందు బంగారు తాపడాలు కలిగిన ఏనుగులాగా పరిపూర్ణమైన శృంగాలతో (కళలతో) ప్రకాశిస్తున్నాడు.
వినష్ట శీతాంబుతుషారపంకః
మహాగ్రహ గ్రాహ వినష్ట పంకః
ప్రకాశలక్ష్మ్యాశ్రయనిర్మలాంకో
రరాజ చంద్రో భగవాన్ శశాంకః ||
మంచుతెరలు లేనివాడై, గ్రహణ దోషము లేనివాడై, నిర్మలమైన గొప్ప ప్రకాశము కలవాడై, భగవంతుడైన శశాంకుడు ప్రకాశిస్తున్నాడు.
శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో
మహారణం ప్రాప్య యథా గజేంద్రః
రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః
తథా ప్రకాశో విరరాజ చంద్రః ||
శిలాప్రదేశాన్ని చేరుకున్న సింహంలాగా, గొప్ప యుద్ధంలో చొరబడిన మహాగజంలాగా, తన రాజ్యాన్ని తాను పొందిన రాజులాగా ఆ చంద్రుడు వెలుగుతున్నాడు.
ప్రకాశచంద్రోదయ నష్ట దోషః
ప్రవృత్తరక్షఃపిశితాశ దోషః
రామాభిరామేరిత చిత్త దోషః
స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః ||
దివ్యమైన ఆ సాయంకాలము చంద్రుని ప్రకాశం చేత తొలగిన దోషము (చీకటి) కలిగినదై, రాక్షసుల భోజనం వేళ అవ్వడం వలన దోషవంతమై, ప్రేయసీ ప్రియుల కోపతాపాది మనోదోషాల్ని తొలగించు కాలమై, స్వర్గం వలె ప్రకాశిస్తున్నది.
—
ఇంతకీ ఈ శ్లోకాలు ఎందులోవంటారా? చెప్పుకోండి చూద్దాం.
ఎందులోనిదో తెలియదు కానీ, రాసిన వారు మాత్రం
ఖచ్చితం గా ఏ గొర్రెల కాపరో, పసువుల కాపరో,
కాకుంటే ఏ ఫారెస్ట్ ఆఫీసరో(in his times!) ఖచ్చితం గా ఐఉంటాడు
సుమండీ !
By: zilebi on October 23, 2011
at 11:37 pm
చంద్రుడి మధ్యలో ’మచ్చ’ ఉంది కాబట్టి, చంద్రుణ్ణి ’అచ్చోసిన ఆంబోతు’ గా అనుకోవచ్చునేమో.
By: రవి on October 24, 2011
at 5:39 am
జిలేబి గారు, సరిగ్గా చెప్పారు, ఆయన ఫారెస్టాఫీసరే…
రవి, ఇరగ్గొట్టారు
మనం భవిష్యత్తులో కావ్యాలేమైనా రాస్తే చంద్రుడి వర్ణనకి మీ ఉపమానాన్ని వాడుకోవచ్చు.
By: nagamurali on October 24, 2011
at 6:08 am
ఫారెస్టాఫీసరైనా అతను కవితలపుట్ట!
వీటికి సమ ఉజ్జీలైన (ఆమాటకొస్తే రెండాకులెక్కువే, నా దృష్టిలో!) పద్యాలు రేపో యెల్లుండో నా బ్లాగులో పెడతాను. అవికూడా చదివి ఆనందించండి.
By: కామేశ్వరరావు on October 24, 2011
at 4:40 pm
నాగమురళీ గారు
నేను ఫారెస్టు ఆఫీసర్ అని గెస్సు చెయ్యడం వాస్తవం!
నాకు క్యూరియాసిటీ ఎక్కువై పొతోంది,
ITis far better to be thought a fool than to open your mouth and remove all doubt.”
అన్న నానుడి తెలిసీ అదుగుతున్నాను , ఎవరండీ బాబు ఆ ఫారెస్టు ఆఫీసరు ?
By: zilebi on October 25, 2011
at 5:54 am
జిలేబి గారు,
కామేశ్వరరావు గారు హింటు ఇచ్చేశారుగా, ‘పుట్ట’ అని!! వాల్మీకి అండీ. ఈ శ్లోకాలు సుందరకాండ అయిదో సర్గలోవి.
By: nagamurali on October 25, 2011
at 6:05 am
మీకూ…., మీ ఇంటిల్లిపాదికీ.. “దీపావళి” శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి…మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా……..?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై “దివిలె” వోలె!
By: rajkumAr on October 26, 2011
at 8:09 am
రాజ్ కుమార్ గారూ,
మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు. పద్యం చాలా బాగుంది. ఇంకా రాస్తూ ఉండండి.
By: nagamurali on October 27, 2011
at 6:27 am
“దదర్శ ధీమాన్ భువి భానుమన్తమ్”, “హంసో యథా రాజతపంజరస్థః” – ఈ రెండు ప్రయోగాలు బావున్నై. భానుడంటే సాధారణంగా రూఢ్యర్థంలో సూర్యుడంటాము. ఈయన “భానుమన్తమ్” – అని క్రియార్థంలో వాడ్డం ఏదో విశేషం దాగుందని అనిపిస్తూంది. అలాగే రాజతపంజరస్థః – రాజ అంటే వెలుగు అని కూడా అర్థం కదా (రరాజ – వెలిగెను). తన వెలుగులో తనే బందీ అయిన భావం కనబడుతున్నది (ఈ ఊహ తప్పో, ఒప్పో తెలీదు).
By: రవి on October 27, 2011
at 7:03 am
రవి గారు,
మీ ఊహ బాగుంది కానీ వాటి గురించి కొంచం పండితులే చెప్పగలరు.
నాకు అర్థమైనంతవరకూ విషయం ఇదీ…
భాను అంటే కిరణం అని అర్థం ఉంది. భానుమంతుడు అంటే ప్రకాశం కలవాడు, సూర్యుడైనా కావచ్చు, చంద్రుడైనా కావచ్చు. (అలాగే అంశుమాన్ అన్నాకూడా సూర్యుడనీ, చంద్రుడనీ అర్థాలు ఉన్నాయి.)
ఇక ‘రాజత’ విషయానికొస్తే – రజత సంబంధమైనది రాజతం (హేమ సంబంధమైనది హైమం లాగా). కాబట్టి రాజతమంటే వెండితో చేయబడిన అనే అనుకుంటా.
By: nagamurali on October 27, 2011
at 9:00 am
Beautiful.
all comments very nice too.
Not so beautiful is SriSri’s simile for the moon on Bahula panchami day – but one can sort of see the similarities
By: kottapalee on October 27, 2011
at 5:00 pm
Dear shri Nagamurali gaaru
This is little bit not pertaining to this topic of post.
I see now and then you write about kaidasa and sanskrit.
I have one question. I read about this ‘salutation to dawn’ (in English) and its ascribed to Kalidasa but I do not find exactly where or in which book of Kalidasa is it there? If you happen to know can you let me know what is its original if its genuinely referring to Kalidasa’s poem? or is it only faked to Kalidasa ?
Just a sample source, but there are aplenty references in the net about this.
http://www.appleseeds.org/Salutation_Dawn.htm
Quote:
Look to this day!
For it is life, the very life of life,
In its brief course
Lie all the verities and realities of your existence:
The bliss of growth,
The glory of action,
The splendor of beauty,
For yesterday is but a dream
And tomorrow only a vision,
But today well lived makes every yesterday
a dream of happiness
And every tomorrow a vision of hope.
Look well, therefore, to this day!
Such is the salutation of the dawn.
Unquote
Ofcourse it does not matter to me if it was not written by Kalidasa as the meaning is great one. But just curious to know what would have been the wordings of Kalidasa ? Just that curiosity only.
Cheers
zilebi.
By: Zilebi on November 6, 2011
at 4:53 pm
Zilebi gaaru, It is very likely a fake quote attributed to Kalidasa. I have never come across any such poem in any of Kalidasa’s kavyas or dramas I have read so far (viz, Kumara sambhavam, Raghuvamsam, Meghadutam, Ritusamhaaram and Saakuntalam).
I did a quick google search and found a similar opinion :
http://sanskritists.livejournal.com/23714.html
By: nagamurali on November 6, 2011
at 5:02 pm
Naga Murali gaaru
Yes, I read that livejournal comments too. The last ananymous says “Hey, just to add some info and I hope it could help,. We have a literature book and it contain the poem you have mentioned,” So I was not quite clear.
Thanks for your clarification. If you happen to know more do let me know.
cheers
zilebi.
By: Zilebi on November 6, 2011
at 5:10 pm
Zilebi gaaru,
I read that last anonymous comment too, but it seems to be just a stupid comment. Will definitely let you know if I come across any more info on this.
By: nagamurali on November 6, 2011
at 5:21 pm