1. నేను లండన్ వెళ్ళిన కొత్తలో మా టీములో ఒక సర్దార్జీ ఉండేవాడు. అతన్ని కొంచం ఆటపట్టించేవాళ్ళం. అతనూ సరదాగానే తీసుకునేవాడు. ఓసారి అతను ఆఫీసుకి వచ్చేసరికి అతని డెస్కు దగ్గర ఎవరో పూల బొకే ఉంచారు. ఎవరో అతనికి అర్థం కాలేదు. మా టీము వాళ్ళు అతని డెస్కు దగ్గరకి వెళ్ళి ‘ఎవరు బాసూ నీకు బొకే పంపింది’ అని అడిగారు. ‘ఎవరంటారు? ఆండ్రూనా?’ అన్నాడు చటుక్కున. ‘ఆండ్రూ నీకు పూలెందుకు పంపుతాడు?’ అని అందరూ గొల్లున నవ్వారు. (ఆండ్రూ మా కొలీగే – వేరే టీము. మామూలు వ్యక్తే, ఏ ‘ప్రత్యేకతా’ లేదు.) ఈలోగా సర్దార్జీకి ఫోన్ వచ్చింది. వాళ్ళావిడ ఫోన్లో విషెస్ చెప్పింది. పూలు పంపించింది ఆవిడే. ఆ తర్వాత మావాళ్ళు అతన్ని గట్టిగానే ఏడిపించారు. ‘ఏక్ ఫూల్ దో మాలీ, ఆండ్రూ ఓమాలీ’ అని చెప్పి. (ఆండ్రూ పూర్తి పేరు ఆండ్రూ ఓమాలీ.)
2. ఓసారి మా టీము అంతా కొంచం లేటయ్యేవరకూ ఆఫీసులో పని చేశాం. పనయ్యాకా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. ఆరోజు లేటయ్యిందని అందరం తొందర తొందరగా లిఫ్టు దగ్గరకి వెళ్ళాం. వీలైనంతమంది లిఫ్టులోకి దూరాం. లిఫ్టు నిండిపోయింది. ఈ సర్దార్జీ, ఇంకా ఒకళ్ళిద్దరు బయట ఉండిపోయారు. మా ఫ్రెండొకతను, ‘పరవాలేదు, మీరు కూడా రండి. ఎక్కువమంది అయితే లిఫ్టు తొందరగా కిందకి వెళ్తుంది’ అన్నాడు. అప్పుడు సర్దార్జీ, ‘I thought I was the only Sardar in the team’ అన్నాడు. అందరం గొల్లున నవ్వాం.
3. నేను సర్దార్జీ అని పేరుపెట్టిన ఒక వ్యక్తి నన్నడిగిన ప్రశ్న, ‘మీకు యూకే వెళ్ళడానికి లగేజీ 28 కేజీలే ఎలౌ చేస్తారు కదా, మరి యూ ఎస్ కి అరవై కేజీలు ఎందుకు ఇస్తారు?’. అందుకు నేను చెప్పిన సమాధానం – ‘యూకే చాలా చిన్న దేశం. అందులో ఎక్కువ సామాను పట్టదు. యూ ఎస్ పెద్ద దేశం కదా వాళ్ళకి బోల్డంత ప్లేసు ఉంది, అందుకే వాళ్ళకి అరవై కేజీలు అని’. (నాకు తప్ప ఎవరికీ నవ్వు రాకపోయినా అందరికీ నవ్వక తప్పలేదు, ఇంటల్లుణ్ణి కదా
)
the sardarji in your second scenario seems very sportive.
By: రాణి on August 19, 2010
at 7:30 pm
Second one – too good!
By: Malakpet Rowdy on August 19, 2010
at 7:40 pm
“నవ్వురాదు” అంటూనే మమ్మల్ని బాగా నవ్వించారుగా…..ఇంతకీ ఆ మూడో సర్దార్జీ ఎవరండీ….ః-)…
By: koutilya on August 19, 2010
at 11:46 pm
రెండోది బాగుంది. సర్దార్జీలు స్వయంగా తమ మీదే జోకులేసుకుని ఆనందిస్తారని చదివానెక్కడో! నిజమేనన్నమాట!
By: చదువరి on August 20, 2010
at 2:13 am
Thanks everybody. రెండోది బాగుందంటే మరి మిగతావాటి సంగతేంటి? అహ, ఏంటీ అంట! నా మనోభావాలు గాయపరుచుకుందామా అనుకున్నా గానీ, కనీసం ఒక్కదానికైనా మీకు నవ్వొచ్చినందుకు క్షమించేస్తున్నా.
కౌటిల్య: ఆ మూడో సర్దార్జీ నా శ్రీమతి చెల్లెలు.
By: nagamurali on August 20, 2010
at 3:59 am
సర్దార్జీ జోకులు బాగున్నాయి
By: Praveen on August 20, 2010
at 9:20 am
రెండోది చాలా బాగుంది
ఫక్కున నవ్వించింది.
By: వేణూశ్రీకాంత్ on August 20, 2010
at 5:08 pm
LOL …. UK and US weight allowance
By: mady on August 20, 2010
at 10:52 pm
Hi Praveen, Thanks. Well, see, how insane I have become these days!!
VenuSrikanth and Mady, Thank you.
By: nagamurali on August 21, 2010
at 10:05 am
నవ్వొచ్చింది మురళి గారు..ఇది చదువుతుంటే నా సర్దార్జీ అనుభవాలు గుర్తొచ్చాయి..ఇవి కూడా నిజాలే..
ఒకసారి సర్దార్జీ గారికి అరిశ తినమని ఇస్తే…ఎక్కడా చిల్లు కనపడట్లేదు,దీనిలోకి పిండి ఎలా దూర్చారబ్బా అని అడిగారు!
మేము వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం…ఏ గది లోను నీరు బయటికి వెళ్ళటానికి పల్లం ఉండేది కాదు..ఇంటి ప్లాన్ గీసింది స్వయానా ఆయనే..సివిల్ ఇంజినీరు!
ఒకసారి ఫోటోలు తీస్తూ కెమెరా లో రీల్ వెసానో లేదో అని ఆనుమానం వచ్చి..మొత్తం రీల్ తెరిచి అప్పటిదాకా తీసిన ఫోటోలు బాగా వచ్చాయా లేదా అని పరీక్షిస్తూ ఉన్నాడు పెద్దాయన!..
By: bujji on August 30, 2010
at 3:18 pm
బుజ్జి గారూ, మీరు చెప్పినాయన ఎవరో ఏ కల్తీ లేని అచ్చమైన సర్దార్జీలాగా అనిపిస్తున్నారు.
ఒక ఫారినర్ కి బూరెలు పెడితే ’అరె, దీన్లోపలకి స్వీటు ఎలా వెళ్ళింది’ అని అడిగాడని జోకు. నిజంగానే అలాంటివాళ్ళున్నారన్నమాట !!
By: nagamurali on August 31, 2010
at 5:31 am
సర్దార్జీలు కాని వాళ్ళల్లో కూడా ఇలాంటివాళ్ళున్నారండీ. ఒకసారి నేను ఆఫీసులో భోజనానికి కూర్చుని బాక్సు తెరిచి ప్లేటులో వంపగానే అందులోని అన్నం అచ్చు ఆ బాక్సు షేపులో పళ్ళెంలో పడింది. అదిచూసి అటుగా వెళుతున్న మా హెచ్చార్ మానేజరు మీ ఆవిడ ఈ షేపులో ఎలా వండగలిగిందీ అంటూ బోలెడు ఆశ్చర్యపడిపోయింది.
ఇక సర్దార్జీల స్పోర్టివ్ నేచర్ గురించి కూడా చాలా సంగతులే ప్రచారంలో ఉన్నాయి. ఏదో ఒక బ్లాగులో(నాగ మురళి గారిదే అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు) నేను చదివిన నిజంగా జరిగిన విషయం – ఒకసారి సహోద్యోగులంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఒకాయన జోకు చెప్పాల్సిన సందర్భం వచ్చిందట. సర్దార్జీ జోకు చెబితే అక్కడ సహోద్యోగుల్లో ఉన్న సర్దార్లు బాధపడతారేమో అని తన జోకును కాస్త మార్చి “ఒకసారి ఇద్దరు బీహారీలు …” అంటూ ఇంకా ఏమో చెప్పబోతున్నంతలో అక్కడున్న సర్దార్లలో ఒకాయన “క్యోం, దునియామే సారే సర్దార్ మర్‌గయే క్యా” అనరిచాడట.
By: బ్లాగాగ్ని on August 31, 2010
at 12:36 pm
బ్లాగాగ్ని: భలే ఉన్నాయ్ మీరు చెప్పిన సంగతులు. మీరు చెప్పిన జోకు నా బ్లాగులోది కాదు.
By: nagamurali on September 1, 2010
at 11:16 am