గత్వా చోర్ధ్వం దశముఖ భుజోచ్ఛ్వాసిత ప్రస్థ సంధే:
కైలాసస్య త్రిదశవనితా దర్పణస్యాతిథి: స్యా:
శృంగోచ్ఛ్రాయై: కుముద విశదైర్యో వితత్య స్థిత: ఖం
రాశీభూత: ప్రతిదినమివ త్ర్యంబకస్యాట్టహాస: ||
‘ఇంకొంచం పైకి వెడితే, అక్కడ ఏం కనిపిస్తుందో తెలుసా? కైలాస పర్వతం. దానికి అతిథిగా వెళ్ళు.
దశకంఠ రావణుడు తన భుజాలతో పైకెత్తడానికి ప్రయత్నించడం వల్ల ఆ పర్వతం యొక్క మూలాలన్నీ కదిలిపోయాయి.
అది ఆకాశంలో వెడుతూ ఉండే దేవతా స్త్రీలు తమ ముఖాల్ని చూసుకునే అద్దంలాగా స్వచ్ఛంగా ఉంటుంది.
ఎత్తైన శృంగాలతో ఆకాశంలోకి విచ్చుకున్న కలువ పువ్వులాగా ఉంటుంది.
పరమశివుడు చేసే అట్టహాసాల్ని ప్రతిరోజూ రాశిగా పోస్తే ఈ పర్వతం తయారైందా అనిపిస్తుంది.’
అనువాదంలో కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అనిపిస్తే, మీ తప్పు కాదు.
కార్తీకమాసం. కార్తీక పూర్ణిమనాడే కాళిదాసు జయంతి కూడా అనుకుంటాను. ఆ సమయంలో ఏదన్నా టపా రాద్దామనుకున్నా గానీ, కుదర్లేదు.
ఇంతకీ ఈ శ్లోకం మేఘదూతం లోదనీ, యక్షుడు మేఘాన్ని ఉద్దేశించి అలకాపట్టణానికి దారి చెప్తూ, దారి మధ్యలో కైలాసాన్ని వర్ణిస్తున్నాడనీ ప్రత్యేకంగా చెప్పాలంటారా?

చాలా బాగుంది. కార్తీక మాసాన శివుని ప్రశంస ఉచితంగా ఉంది. కళ్ళతో చూసినట్లే ఎలా వర్ణించాడో కాళిదాసు! అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే చూశాడేమో!
By: చంద్ర మోహన్ on November 17, 2008
at 5:17 pm
baagundi vrnana
By: శివ బండారు on November 17, 2008
at 5:19 pm
భలే
By: కొత్తపాళీ on November 17, 2008
at 10:12 pm
కార్తీకమాసంలో కైలాసపర్వత దర్శనం చేయించారు. ధన్యవాదములు.
By: చిలమకూరు విజయమోహన్ on November 17, 2008
at 10:49 pm
వంక జాబిలి నీడ
మంచు మంచము పైన
పవ్వళించిన ఓ జంగమయ్యా!
ఓయనవయ్యా! ఓయి శివయ్యా!
నాగమురళీగారూ, చాలా బాగుంది.
By: చివుకుల కృష్ణమోహన్ on November 18, 2008
at 3:33 am
Good One!!!
By: laxmi on November 18, 2008
at 4:37 am
ఎందుకో చప్పున “తెనాలి రామకృష్ణ” కవి గుర్తొచ్చాడు.
“నరసింహ కృష్ణ రాయల కర
మరుదగు కీర్తి వెలయు కరిభిత్
గిరిభిత్ కరికరిభిత్ గిరిగిరి భిత్
కరిభిత్తురంగ కమనీయంబై”
(పైన పద్యం చప్పున గుర్తొచ్చి రాశాను. సరిచూసుకోలేదు)
ఇందులో కరిభిత్ గిరి అంటే కైలాస గిరి (కరిభిత్ – గజాసురుని వధించినవాడు.)…
శ్లోకంతో పాటు, ఇంకొన్ని విశేషాలు రాయాలని మనవి.
By: రవి on November 18, 2008
at 5:18 am
చంద్రమోహన్ గారూ: కాళిదాసు హిమాలయాల్ని చాలా చోట్ల వర్ణించాడు కాబట్టి ఆయన ఆ ప్రదేశాల్లో తిరిగి ఉంటాడనే నాకూ అనిపిస్తుంది. అలాగే, మేఘదూతంలో ఉజ్జయినీ నగర వర్ణన, మహాకాలుడి వర్ణన చదివారా?
శివ, కొత్తపాళీ, విజయమోహన్: కృతజ్ఞతలు.
కృష్ణమోహన్ గారూ: మీరు రాసినది కూడా చాలా బాగుందండీ.
లక్ష్మి గారూ: నెనర్లు.
రవి:ఆఖరి పాదం తేడా వచ్చినట్టుంది. కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయంబై అని ఉండాలనుకుంటా. ఈ పద్యం చాలా సైట్లలో వివరించబడింది. ఇదివరకు దీని అర్థం వివరిస్తూ ఒక టపా కూడా రాశాను.
By: nagamurali on November 18, 2008
at 5:47 am
అవును. ఆఖరు పాదం టైపు చేసి, సరిగ్గ మీట నొక్కేప్పుడు గమనించాను
.
నేనూ చూసాను చాలా చోట్ల. అయితే, ఈ పద్యం అర్థం నేనో పుస్తకంలో చదివాను.
కృష్ణమోహన్ గారు ; ఇందాక చూడలేదు మీ పద్యం. జిలేబీ ముక్క లా ఉంది
అందుకోండి అభినందనలు.
By: రవి on November 18, 2008
at 6:33 am
కైలాస పర్వత ఊర్ధ్వ భాగంలో మనకి ఓంకారం దర్శనం ఇస్తుంది..చార్ ధాం యాత్ర+మానస సరోవర యాత్ర అన్న విడియోలో చూసాను..
By: pappu on November 18, 2008
at 7:08 am
harahara mahaadeva
By: durgeswara on November 18, 2008
at 8:48 am
చాలా బాగుందండి! కృష్ణ మోహన్ గారి పద్యం కూడా…!
By: సుజాత on November 18, 2008
at 9:30 am
బాగుంది. కాళిదాసు హిమాలయాల దగ్గరి వాడనే చరిత్రకారుల అభిప్రాయం. ఈ కోణంలో కైలాసగిరి చిత్రం చూడలేదు గతంలో.
By: వికటకవి on November 19, 2008
at 3:59 pm
pappu, దుర్గేశ్వర, సుజాత గారు, వికటకవి: నెనర్లు.
By: nagamurali on November 19, 2008
at 10:18 pm
[...] నమ్మట్లేదు కదూ? ఓ సారి ఇక్కడకు వెళ్ళి కైలాస శిఖర దర్శనం చేసి, వస్తూ వస్తూ వీలయితే, ఈ తామర [...]
By: పొద్దు » Blog Archive » నాగమురళి బ్లాగు - సమీక్ష on February 15, 2009
at 6:21 am