మా ఊళ్ళో ప్రసిద్ధులైన ఒక కవి ఉన్నారు. ఇప్పుడు బాగా వృద్ధులైపోయారు. మా చిన్నతనంలో తరచుగా మా ఇంటికి వచ్చి ఆయన రాసిన కవితలు వినిపిస్తూ ఉండేవారు. చాలా సాహిత్య విశేషాలు కూడా చెప్తూ ఉండేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారితో ఆయనకి పరిచయం ఉండేది.
ఒకసారి ఈయనా, విశ్వనాథవారూ, మరికొందరూ కారులో వెడుతున్నారట. కారు గతుకుల రోడ్డు మీద పోతోంది. ఈయన అర్భకులు కావడంతో ఎగిరెగిరి పడుతున్నారు. ‘ఏమిటయ్యా, మరీ అంత ఇబ్బంది పడుతున్నావు’ అని విశ్వనాథవారు అడిగారుట. అప్పుడీయన ‘ఉద్ధతుల మధ్యనుండ తరమె?’ అన్నారట (ఖచ్చితంగా అదే మాట కాకపోవచ్చు, కానీ ఇంచుమించుగా అలాంటిదే ఏదో అనుకుంటా). అంటే, మావంటి సామాన్యులకి మీవంటి గొప్పవారి మధ్య ఉండడం సాధ్యమా అని. దానికి విశ్వనాథ, ‘మీరూ ఉద్ధతులే’ అన్నారట. అందరూ గొల్లున నవ్వారట. ఇక్కడ ఉద్ధతులు అంటే ఉత్ + హతులు – పైకి కొట్టబడినవారు అని అర్థం వస్తుంది.
‘ఉద్ధతుల మధ్య నిరుపేదకుండ తరమె?’ అనుకుంటా. ఈ పద్యానికి రెండు అన్వయాలు ఉన్నాయి. దీనికి రాయల కాలం నాటి కథొకటి చెప్తారు.
By: సుగాత్రి on July 16, 2008
at 11:10 am
సుగాత్రి గారూ, మీ కామెంటుకు ధన్యవాదాలు. మీకు వీలైతే ఆ పద్యం, కథా వివరిస్తారా?
By: nagamurali on July 16, 2008
at 11:44 am
నాగమురళి గారు,
సుగాత్రి గారు చెప్పక ముందే నేను చెప్పేస్తున్నాను.
తే. గీ. ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి చూచి
తరుణి తను మధ్య మెచటికో తొలగి పోయె
ఉండెనేనియు కనబడ కుండె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కుండతరమే
మీరు ఈ link చూడండి. కథ కూడా తెలుస్తుంది.
http://www.bhaavana.net/telusa/jun96/0151.html
సూర్యప్రకాష్
By: suryaprakash on July 16, 2008
at 1:02 pm
బాగుంది
బొల్లోజు బాబా
By: bollojubaba on July 16, 2008
at 1:04 pm
సూర్య ప్రకాశ్ గారూ, పద్యమూ, కథా కూడా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు.
బొల్లోజు బాబా గారూ, నెనర్లు.
By: nagamurali on July 16, 2008
at 3:06 pm
ఈ టపా వల్ల ఒక మంచి కద తెలిసింది నెనర్లు.
By: Naga Muralidhar Namala on July 16, 2008
at 5:40 pm
సూర్య ప్రకాష్ గారు కథ చెప్పేసారు. నృసింహ కవి పూర్తి పేరు సంకుసాల నృసింహ కవి (ఆ పద్యం రాసినాయన).
ఇలా ఒకరి పద్యం ఇంకొకరు కొనడం ఇన్కో సందర్భంలోనూ జరిగిందట. ముక్కు తిమ్మన “నానా సూన వితాన …” అన్న పద్యం రాసి, ఓ క్షురకుడికిచ్చి ఈ పద్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోమన్నాడట. ఆ పద్యాన్ని భట్టు మూర్తి గారు ౫౦౦౦ వరహాలకు కొని, తమ వసుచరిత్ర లో వాడుకొన్నారు అని ఓ కథ.
ఆ పద్యం గురిన్చి భైరవ భట్ల కామేశ్వర్రావు గారి బ్లాగు లో వెతికితే దొరుకుతుంది.
By: రవి on July 17, 2008
at 8:24 am
మంచి పద్యాన్ని పరిచయం చేసిన నాగమురళిగారికి, దాన్ని విడమరచిన సూర్యప్రకాష్ గారికి ఇద్దరికీ ధన్య వాదాలు.
By: భావకుడన్ on July 31, 2008
at 12:01 pm