సల్మాన్ రష్దీ నవల ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ కి బెస్ట్ ఆఫ్ బుకర్ ప్రైజ్ వచ్చిందని ఇవాళ న్యూసు. నేను ఇంగ్లండు వచ్చిన కొత్తల్లో మా ఏరియా లైబ్రరీలో Satanic Verses నవల కనపడింది. దీన్ని మన దేశంలో నిషేధించారు కదా. దాని మీద జరిగిన గొడవ అంతా తెలుసు కాబట్టి వెంటనే ఆ పుస్తకం పట్టుకొచ్చి చదివేశా. ఆ నవల చదువుతున్నప్పుడు గర్వపడిన విషయమేమిటంటే అందులో కథా, కేరక్టర్లూ మన దేశానికి చెందినవే అని. మొదట్లో రష్దీ రచనా శైలీ, అందులో పిచ్చి పిచ్చిగా బూతులు వాడిన తీరూ కొంచం వింతగా అనిపించినా తరవాత అలవాటైపోయింది. అందులో వివాదాస్పదమైన భాగాలు చదువుతున్నప్పుడు రచయిత చాలా గొప్ప సాహసం చేశాడనే అనిపించింది. ఆ నవల మీద ఎందుకంత గొడవైందో అర్థమైంది.
తరవాత Midnight’s Children కూడా చదివేను. ఇది మొత్తం మన దేశానికి సంబంధించినదే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడందాకా జరిగిన పరిణామాల్ని చాలా వ్యంగ్యంగా రాస్తాడు. ఇందులో కొన్ని కొన్ని ఘట్టాలూ, జోకులూ నేను ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా చదవదగిన పుస్తకమే. దీన్ని ఎవరైనా తెలుగులోకి అనువదించారో లేదో తెలియదు.
మొత్తానికి నేను రష్దీకి పెద్ద అభిమానినైతే కాదు గానీ, ఈ నవలకి మళ్ళా అవార్డు రావడం మాత్రం సంతోషాన్ని కలిగించింది.
ఇప్పుడే వార్తల్లో చూసాను దీని గురించి. అప్పుడే ’టపా’ ఎక్కేసిందా ఈ వార్త!!
సతానిక్ వర్సెస్స్.. చదవాలనుకుంటూనే కాలం గడచిపోతుంది.
నేనా పుస్తకం చదువుతున్నప్పుడే.. దానికో అవార్డు రావటం.. నాకెందుకో థ్రిల్లింగా ఉంది.
By: Purnima on July 10, 2008
at 3:44 pm
దీని గురించి ఎవరో మాటాడుతుంటే విన్నను ఇప్ప్పుడు చూశాను, ఖచ్చితంగా చదువుతాను
By: aswin budaraju on July 10, 2008
at 8:13 pm
midnight’s children is his best.
Satanic verses became famous only because of hte controversy. does not hold a candle to midnight’s children.
By: కొత్తపాళీ on July 11, 2008
at 1:10 am
ఇంగ్లీషు నవలలు చదివేంత ఓపిక, తెలివీ లేని మా లాంటి మృత్తికా మస్తకుల కోసం ఎవరైనా సమీక్ష రాస్తే బావుంటుంది.
By: రవి on July 11, 2008
at 10:57 am
రవి గారూ, బీబీసీ వెబ్ సైటు వాళ్ళు ఇవాళ ఈ నవలని 67 పదాల్లో సమీక్షించమని పాఠకులకి కాంపిటిషన్ పెట్టారు. చూడండి –
http://news.bbc.co.uk/1/hi/magazine/7500575.stm
By: nagamurali on July 11, 2008
at 11:13 am
[...] జ్యోతిష్యం మీద వివరణా, ఇంతలోనే సాల్మన్ రష్దీ గురించి ఓ వివరణా, తెలుగు సినిమాల మీద [...]
By: పొద్దు » Blog Archive » నాగమురళి బ్లాగు - సమీక్ష on January 13, 2009
at 12:45 pm