Posted by: nagamurali | April 23, 2008

పాత చందమామలు

జీవులకి ఆత్మ ఉండడం నిజమైతే, చనిపోయాకా అది స్వర్గానికో నరకానికో వెళ్ళడం నిజమైతే, నేను చనిపోయాకా కొద్దికాలమైనా స్వర్గంలో గడపడం తటస్థిస్తే, అక్కడ నాకోసం ఖచ్చితంగా ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఒక సెక్షన్ లో పాత చందమామలూ, బాలజ్యోతులూ అన్నీ సంవత్సరాలవారీగా బైండు చేసి ఉంటాయి. నా చిన్నప్పుడు చదివిన పుస్తకాలు మళ్ళీ చూసుకుని నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాను.

            

ఇంకా స్వర్గానికి పోకుండానే అటువంటి అనుభవం కలిగింది నిన్న. 1947 నుంచీ 2006 దాకా చందమామలు అన్నీ ఇంటర్నెట్ లైబ్రరీ లో ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు బొమ్మలు, అడ్వర్టయిజ్మెంట్లతో సహా ఇప్పటికీ నా కళ్ళముందు ఉన్నాయి. అవే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటుంటే ఒక ‘నోస్టాల్జియా’ ఆవహించింది.

            

బహుశా నేను బొమ్మల కథల పుస్తకాలు చదవడం నా ఆరు, లేక ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టి ఉంటాను. ఇంకా చిన్నతనంలో కూడా ఏమైనా చదివానేమోగానీ అవేవీ గుర్తు లేవు. కానీ ఆరేడేళ్ళ వయసునాటి పుస్తకాలు ఇప్పుడు చూస్తే ఇంకా నిన్న మొన్న చదివినట్టే అనిపించింది. బహుశా తరవాత సంవత్సరాల్లో కూడా చాలాసార్లు పారాయణ చేసినందువల్ల కావచ్చు. సుమారు పదిహేనో ఏడు వచ్చేవరకూ కథలపుస్తకాలు చదువుతూనే ఉన్నాను. పాతవి పారాయణ చేస్తూనే ఉన్నాను.

          

ఇంతకీ ఈ చందమామలు ఎక్కడ ఉన్నాయంటే, http://www.ulib.org కి వెళ్ళండి. అందులో Advanced Search లోకి వెళ్ళండి. Title లో Chandamama అని కొట్టి, Language లో Telugu సెలెక్టు చెయ్యండి. సెర్చి కొట్టండి. అంతే, అన్నీ మీ ముందు ప్రత్యక్షమౌతాయి.

          

నిన్న ఉండబట్టలేక చిన్నప్పుడు చదివిన ‘ముగ్గురు మాంత్రికులు’ సీరియల్ మళ్ళా మొదటినుంచీ చివరిదాకా చదువుతుంటే తెలిసింది. కొన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల చందమామలు అందులో లేవు. మిస్సయ్యాయి. చాలా బాధ కలిగింది. ఆ ఎడిషన్లు అసలు చందమామ వాళ్ళదగ్గరే లేవేమో? అలా అయితే మటుకు తెలుగు జాతికి గొప్ప నష్టం జరిగినట్టే.

            

మరో సంగతి. ఈ సైట్లో చందమామలు పీడీఎఫ్ రీడర్ సహాయంతో పేజీ తరవాత పేజీ చదువుకోవాలి. సదుపాయంగా ఉండదు. అయినా కొంచం ఓపిక ఉంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. www.chandamama.com లో Archives సెక్షన్లో 1947 నుంచీ 1959 దాకా అన్నీ పీడీఎఫ్ ఫైల్సు రూపంలో ఉన్నాయి. ఇవి చదువుకోడానికి చాలా సదుపాయంగా ఉంటాయి. సైటువాళ్ళు మిగతావి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతవరకూ http://www.ulib.org మాత్రమే గతి కాబోలు.

           

మరి ఇంకా ఆలస్యమెందుకు? చదువుకోవడం మొదలు పెట్టండి


Responses

  1. నాగ మురళి గారు,

    చాలా మంచి లంకెలు పట్టారు. మా ఇంట్లో అయితే, చందమామ నేనంటే నేను ముందు చదవాలని కొట్టుకోవటాలే. కృతజ్ఞతలు.

  2. అసలు అంత పాత చందమామలు దొరకాలే గానీ, అవి ఏ రూపంలో ఉంటే ఏమిటండీ? ఇప్పుడే చూశాను. సంవత్సరం పక్కన , అదేంటీ, నెలా? అవేవో రష్యన్ పేర్లనుకుని,ముందు వదిలేసా, తర్వాత తెలిసింది ! మంచి లంకే పట్టారు. అందునా వేసవి సెలవుల్లో! మా అమ్మాయికి కథలు స్రుష్టించలేక చస్తున్న సమయంలో మంచి సహాయం చేసారు. థాంక్స్ . ఆ నాటి పాత సీరియళ్ళు, అసలు మనం పుట్టక ముందు నాటి కథలు చదువుతామని తల్చుకుంటే, బలే ఖుషీగా ఉంది.

  3. మీరు నాకంటే చిన్నవాళ్ళే .. కానీ ఈ టపాకి మాత్రం .. అబ్బే వొద్దులే మరీ సెంటిమెంటు ఎక్కువైపోయింది .. వోకే .. అభిమానంతో కావిలించుకుంటున్నా .. ఇక్కణ్ణించే :-)

  4. chaalaa mamchi linku pampinchearu. chinnanaaTi jnaapakaalu gurtu cheasearu.
    ippaTikii naaku faev pustakam chandamaamea.

    maa inTlo 1950 nunchi chamdamaamalu unDeavi.
    veasavi loane paata pustakalu bayaTaki teeseavaaru.
    meamu oka poaTii peTTukunea vaaLLam.
    veasavi Salavallo bomma chusi kadha cheppaali.

  5. చాలా మంచి లింకు పంపించేరు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసేరు.
    ఇప్పటికీ నాకు ఫేవ్ పుస్తకం చందమామే.

    మా ఇంట్లొ 1950 నుంచి చందమామలు ఉండేవి.
    వేసవి లోనె పాత పుస్తకలు బయటకి తీసేవారు.
    మేము ఒక పోటీ పెట్టుకునే వాళ్ళం.
    వేసవి శలవల్లొ బొమ్మ చుసి కధ చెప్పాలి.

  6. ఆసం! భలే…

  7. వికటకవి గారూ, నెనర్లు.

    సుజాత గారూ, నేను కూడా మొదట చూసి అవి ఏ రష్యన్ పేర్లో అనుకున్నాను. ఇంగ్లీషు పదాల్ని యథాతథంగా ట్రాన్స్ లిటరేట్ చేస్తే అలా అఘోరించాయి. లైబ్రరీవాళ్ళు అంత పెద్ద పని చేస్తూ కూడా పెర్ ఫెక్ట్ గా ఎందుకు చెయ్యరో నాకు అర్ధం కాదు. ఇంక మా అమ్మాయి కూడా ఎప్పుడు పెరిగి కథలు చెప్పించుకునే స్థాయికి వస్తుందా అని ఉంది నాకు.

    కొత్తపాళీ గారూ, మీ కామెంటు చూసి చాలా ఆనందం వేసింది. చాలా కృతజ్జతలు.

    దుర్గ గారూ, నెనర్లు. బహుశా చాలా తెలుగు ఇళ్ళలొ అంతే అనుకుంటాను. మా ఇంట్లో కూడా చిన్నప్పుడు వేసవి సెలవలు వచ్చాయి అంటే అటక ఎక్కి పాత కథల పుస్తకాలు అన్నీ తియ్యాల్సిందే. ఇల్లు లైబ్రరీలా తయారయ్యింది అని మా అమ్మ నవ్వుకుంటూ ఉండేది.

    ప్రవీణ్ గారూ, నెనర్లు.

  8. మీరు ఇటివంటి లింకులు సంపాదించడములోను, మరియు వెతకడము లోను నిష్ణాతులు.. చాలా ధన్యవాదాలు లింకుకు,

  9. మురళీ,
    పాతచందమామలు లింకు సంపాదించి చదువుతున్నావంటే మన ఊరి పాతఇంట్లో అటకమీద పుస్తకాల కట్టలు క్రిందకి దింపించి, అన్నయ్య, నువ్వు సీరియస్ గా చదువుకుననే రోజులు గుర్తుకు వచ్చి చాలా సంతోషించాను.

  10. చందమామదొరికే సరికి సంతోషం పట్టలేక బాలజ్యోతులు కూడ దొరుకుతాయేమోననుకున్నాను. ప్చ్… అయినా బాలజ్యోతులు లేకపోతేనేం, చందమామ వుందిగదా.

    చక్కటి అంతర్జాలగ్రంథాలయాన్ని పరిచయం చేసారు, కృతజ్ఞతలు.

  11. బ్లాగేశ్వరా, నెనర్లు. ఒక్కోసారి ఏమీ తోచక సెర్చి చేస్తుంటే ట్రెజర్ హంట్ లాగా నిధులు దొరుకుతుంటాయి. అదృష్టం, అంతే.
    రాఘవ గారూ, బాలజ్యోతులు కూడా ఎక్కడన్నా దొరికితే బాగుణ్ణండీ. చందమామతో పాటూ అవి కూడా తెగ చదివాం మేము.

  12. నాగమురళి గారూ, Thank you… Thank You.. ఇంకా బోల్డన్ని Thanksలు.. ఆ ప్రింట్, బొమ్మలూ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో!!

  13. నిషిగంధ గారూ, నెనర్లు.

  14. నాగమురళి గారూ, నేను చందమామ డాట్ కాం లో అన్ని పీడీఎఫ్ లు డవున్లోడ్ చేసుకున్నాను. మా ఇంట్లో, ముగ్గురు మాంత్రికులు బౌండ్ చేసిన పుస్తకం ఉంది. బాలజ్యోతి కోసం, మేమూ కొట్టుకునే వాళ్ళం. నేనూ చందమామ, బాలజ్యోతి పిచ్చోణ్ణే.

  15. Nagaraju gaaru. Meeku Thanks elaa cheppukovaalao theliyadam ledu. Inth manchi information icchinanduku chaala chaalaa thanks. Eee page lo responses choostu vunte naaku chaalaa aanandamga vundi. Intha mandi chandamama premikulunnaarani thelisi chaalaa santoshamgaa vundi.

    Thanks once again

  16. శ్రీనివాస్ గారూ,
    ధన్యవాదాలు.

  17. Naga Murali garu,

    Compliments to u for ur successful treasure hunt.

    Actually I searched ‘Net’ earlier for Digital Chandamamas based on the news published in an English daily. I was not succeeded then.

    Hearly congrats!

    It is really difficult to download from ulib.org. It takes a lot of time.

    Would u please tell me the easy way?

  18. chandamama’s are not available for reading. Give me full procedure.

  19. chala chala thanks andi..e tapa post chesinanduku..

    mm matalllo varnichaleni anadamu naku chandamamlu antey chala istamu..

    thanks once again :)

  20. [...] చందమామను నేలపైకి ఎవరో తీసుకొస్తే, ఆ జాబిల్లి చిరునామాను వెతికి, ఆ వెలుగులను నలుగురికీ [...]

  21. I am thrilled to find this .I am seriously taking print of all these .I am Thrilled thrilled thrilled ..entho happy gaa undhi

  22. Ulib lo okka page matrame download avutunnadi. Mottam book ela download chesukovalo evaraina teliste cheppagalara. Chanadama archieveslo antaku mundu pdf format lo download ayyevi. Ippudu download option vunnatlu ledu. Emaina salahalu? Kumar

  23. Please see the link below to download full chandamama monthlies

    http://blogaagni.blogspot.com/2008/12/wwwuliborg.html

  24. చాలా చాలా థాంక్స్


Leave a response

Your response:

Categories