Posted by: nagamurali | March 17, 2008

క్రొత్తయాశ కలిగె కవితలల్ల

ఇవి రాసి రెండు వారాలు దాటింది. ఇక తెగించి, ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అనీ, ‘నా బ్లాగుకి నేనే సుమన్’ అనీ చెప్పుకుని నా టీవీలో (అదే బ్లాగులో) పెట్టేస్తున్నా. మెల్లిగా కందాలూ, సీసాలూ, ఆపైన వృత్తాలూ… అరెరె, పారిపోకండి, ప్రస్తుతం అంత టైము లేదు లెండి.

చాలకాలమాయె చక్కగ పద్యాలు
వ్రాయు కోరికదియె వడిలిపోయి
మరల బ్లాగులందు మిత్రవరులజూచి
క్రొత్తయాశ కలిగె కవితలల్ల ||

ఆటవెలదులన్న అతితేలికనుకొంటి
అంత తేలికగాదు అరసిజూడ
వెతలు కలిగె యతికి, వేమన పద్యాలు
చదివి చదివి కొంత సులువు తెలిసె ||


Responses

  1. All the best

  2. హహ్హహ్హ… భలే. మా పద్యరచయితల సంఘంలోకి స్వాగతం.

    ఆ.వె. ఆటవెలది తోటి ఆటలాడగలిన
    శక్తి మీకు వుంది యుక్తితోడ
    శుభతరుణ మిదనుచు చొరవజూపి యికపై
    పద్యములను చెప్పవలెను తమరు.

  3. welcome to the club!
    I see that the bug got you too.

  4. ఇట్లె వ్రాయుచుండ ఇట్టిట్టె మీరునూ
    ఆటవెలదిలేమి, పూటకో వృత్తము
    వ్రాయ నేర్తురింక సోయగముగ – నమ్మ
    కమ్మునుంచి సాగిపొమ్మిక ఆగక

  5. బ్లాగాగ్ని గారూ, రాఘవ గారూ, కొత్తపాళీ గారూ, గిరి గారూ, నెనర్లు.

    ఇంకా యతి నియమాలు వంటపట్టించుకోవాలండీ. మీకు తెలిసిన కిటుకులేమన్నా ఉంటే దయచేసి మీ బ్లాగులో రాయండి.

  6. నమస్కారం నాగ మురళి గారు,
    మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను. మీకూ ఇలాంటి జబ్బు వుండేవుంటుందని…

    నా వంతు – http://andam.blogspot.com/search/label/పద్యం
    అందులో మొదటి రెండూ వడిలేసి మూడవదాని నుండీ చూడగలరు.
    ప్రత్యేకించి – వృత్తాలు వ్రాయడానికి ఉపకరించే టపా తప్పక చూడండి.

    పొద్దులో ఉగాది టపాలలో మీకో ట్రీటు లభించగలదు.
    అలానే మీ కోసం – http://soundarya-lahari.blogspot.com/

    @ గిరి గారు,
    మీరు వ్రాసిన కొత్తవెలది (ఆటవెలది వేలు విడిచిన అత్తగారు) చాలా బాగుంది :) దయచేసి దాని మీద పేటెంటు తీసుకోవద్దు !

  7. వీటికి యతి కుదరలేదని ఇప్పుడే గ్రహించాను -
    మరల – మిత్ర
    క్రొత్త – కవిత
    చదివి – సులువు

    అయినా తప్పులెంచకుండా ప్రోత్సహించిన మీ సహృదయానికి ధన్యవాదాలు.

  8. రెండో పద్యం నాకు చాలా నచ్చింది. చాలా బాగా రాశారండి. త్వరలో యతుల వెతలు తీర్చగలరని ఆశిస్తూ… మీకు శుభాకాంక్షలు.

  9. @ నాగమురళి, మొత్తానికి నేను చెలవల్లో ఉండగా కార్యం ఆరంభించేశారన్నమాట. అభినందనలు.


Leave a response

Your response:

Categories