Posted by: nagamurali | February 28, 2008

భారతదేశం గురించి హిట్లర్ ఏమన్నాడంటే…

ప్రస్తుతం నియాల్ ఫెర్గూసన్ రాసిన ది ఎంపైర్ పుస్తకం చదువుతున్నా. చాలా విశేషాలున్నాయి అందులో. ఇవాళ హిట్లర్ భారతదేశాన్ని గురించి ఏమన్నాడో చదివి కొంచం షాకయ్యాను. నేను ఇదివరకు ఒకళ్ళిద్దరు ఇంగ్లీషు రచయితల్ని కలిశాను. మాటల సందర్భంలో గాంధీగారి గురించి వాళ్ళ అభిప్రాయమేమిటని అడిగాను. వాళ్ళ ఉద్దేశ్యం ప్రకారం బ్రిటిషువాళ్ళు మానవ హక్కుల్ని గౌరవించే నాగరికులు కాబట్టి గాంధీగారి శాంతియుత పధ్దతులు చెల్లుబాటయ్యాయి. గాంధీగారి అహింస, సత్యాగ్రహమూ మొదలైనవి హిట్లర్ లాంటి రాక్షసుడి దగ్గర అయితే ఎంతమాత్రమూ సాగేవి కావని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సరే, అది అలా ఉంచితే, హిట్లర్ మన దేశాన్ని గురించి అప్పట్లో ఏమన్నాడో చూడండి.

’భారతదేశాన్ని చెడ్డగా పాలించామని కొంతమంది బ్రిటిష్ వాళ్ళు తమను తాము విమర్శించుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే, భారతీయులు వాళ్ళ పాలనపట్ల సంతృప్తిగా లేరట. నేనంటాను, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని చాలా బాగా పాలించారు, కానీ వాళ్ళ తప్పేమిటంటే, భారతీయులు తమ పాలన పట్ల సంతృప్తి చెందాలని కోరుకోవడం’.

బ్రిటిష్ విదేశాంగ మంత్రి లార్డ్ హేలీఫాక్స్ తో 1937 లో హిట్లర్ ఇలా అన్నాడు. ’గాంధీని కాల్చెయ్యండి. వాళ్ళు లొంగిరావడానికి అది సరిపోకపోతే కాంగ్రెస్ లో అగ్ర నాయకులు ఒక డజను మందిని కాల్చెయ్యండి. అది కూడా సరిపోకపోతే రెండువందలమందిని కాల్చెయ్యండి. పరిస్థితి లొంగుబాటులోకి రావడానికి అలా ఎంతమంది అవసరమైతే అంతమందిని’.

తన ఆత్మకథలో ఇలా రాశాడు – ’ఇంగ్లండు భారతదేశాన్ని కోల్పోతుంది, ఎప్పుడంటే, తన అధికార యంత్రాంగం జాతిపరంగా  ఛిన్నాభిన్నమైనప్పుడు, లేదా మరొక శక్తిమంతుడైన శతృవు ఓడించినప్పుడు. భారతీయ ఆందోళనకారులు మాత్రం దాన్ని ఎన్నడూ సాధించలేరు. ఒకవేళ ఇంగ్లీషువాళ్ళు భారత దేశానికి స్వాతంత్ర్యమిచ్చినట్లైతే ఒక ఇరవై సంవత్సరాల కాలంలో భారతదేశం మళ్ళీ తన స్వాతంత్ర్యాన్ని కోల్పోతుంది’.

’భారతీయులు బ్రిటిష్ వాళ్ళ కింద ఎంత హీనంగా దీనంగా బతికినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళేమీ మెరుగ్గా ఉండరు. ఒకవేళ మనమే గనక భారతదేశాన్ని అప్పుడు తీసేసుకుంటే, వాళ్ళేమీ ఆనందించరు, సరికదా, ఇంగ్లీషువాళ్ళు పాలించే రోజులే బాగుండేవని బాధపడతారు’.


Responses

  1. అప్పుడేమో గానీ ఇప్పుడు మాత్రం ఒక రెండు వందల మంది రాజకీయ నాయకులను కాల్చినా నాకే అభ్యంతరం లేదు. దేశాన్ని బ్రిటీష్ పాలన కంటే హీనంగా మార్చేస్తున్నారు.

  2. బ్రిటీష్ వాళ్ళ పాలనలో వున్న నాణ్యత ఈ నాటి పాలనలో లేదు. అవినీతి ఎక్కువైంది. మన కోసమే కాకుండా భావితరాలను దృష్టి లో వుంచుకుని పని చేసినపుడే మనం, దేశం రెండూ బాగుపడతాయి.

  3. హిట్లరు అభిప్రాయాలని ఈరోజు పట్టించుకోనవసరం లేదు. వాటికి ఏనాడో కాలం చెల్లింది. తెల్ల దొరలు ఇంకా మన మీద ఆధిపత్యం చేస్తూ వుండి వున్నట్లయితే, మన దగ్గర మిగిలిన ఆ మిగతా కొద్దీ, మాచక్కగా దోచుకుపోయుండేవారు. అనుమానం లేదు. వారి పాలన లో మనకు మేలు జరిగిన మాట వాస్తవమే అయినా, అదివారి సౌకర్యాన్ని మొదట ఉద్దేశించినది. వారి జీవన శైలి వివక్షా భరితం.

    ఇక మన స్వయం పాలనకొస్తే, మోసపోవడనికి సిద్ధంగా వుండేవాళ్లు (గలిబుల్ లాట్) వుంటే, ఎందుకు మోసం చెయ్యరు. నిరక్షరాస్యతని కొద్ది కొద్దిగానైనా, క్రమంగా నిర్మూలిస్తే, మనం వారి బాబుల్లా వుంటాము. ఇది నా గట్టి నమ్మకం.

  4. చిన్నమయ్య గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. యూరోపియన్లు (జర్మనీ, ఇంగ్లాండ్ వగైరా) నాగరికత అనే పదం వినక మునుపే, ఇక్కడ విశ్వవిద్యాలయాలు నడిపిన నేల ఇది. సామ్య వాదం (డెమోక్రసీ) గురించో, అభివృద్ధి గురించో, హిట్లర్ లాంటి ఓ రాక్షసుడి దగ్గర నేర్చుకునే అవసరం ఎవరికీ లేదు.

  5. oka niyantha maatala gurinchi asalu pattinchukonavasaram ledu. yndukante athanu niyantha kabatti athani matalalage vuntai. there is no need to give any preference or importance on the opinions of such type of people

  6. nenu kuda padmavathi matalato ekibhavistunnanu.
    Ekapote mana kullu rajakiyanni kadigeyali.

    Ramesh Babu Thota
    ramthota6@yahoo.co.in

  7. aithe nenu mathram konchem ekeebavistunnanu British vaallu paripalinchina rojullone manadeshamlo rail margalu abivruddi jariginamata vastavam adi denikosamina kannivvandi(asalu karanam kanijalanu boomilonundi teesi ravana cheyadam) appati darulane manam inka vadutunnamanna mata satyam aithe manam hitler matalanu pattinchukonavasaram ledu endukante enthomandi governer jounrals tama diarylo rasukunnadaniki eecoment ki edi poorthi bhinnam
    aithe hitler tana buddi elantido entharakshasudo kuda tananu tane vivarinchukunnadu entha kanna inka em kavali vaado homsavadhi kabatti vadi maatalu alage untai

    aithe ravikumar cheppindi chala nijam pratiokkadu paty petteyadam vallaku vanda seetlistam veelaku inni seetlistamani cheppi mathathathvanni kulathathvanni reputhunna vallandarini linlo nilchobetti kalchi 10000000 sarlu uriteesina papam ledu

    eteevali kalamlo rajakeeyalalo prateeokkadu anthe gelavali gelichi andarini munchalani chusevade elanti valla kosama mana vallu anthakashtapadi swatanthranni theesukoni vachindi

    okkademo party maataatadani danikosam edina chestanantadu rashtramemaina vani illa
    enkokademo monnamonna vachi inni rojulu rashtranni gurinchi emipattinchukokunda musalodu ainatharvatha nenu adi idi chestanu ani 100 seetlu meme istunnam antadu kavalisindi adi kadu nanna samajika chaitanyam ante telini vallu kuda danni pattukoni veladutunte mana vallaki cinema lo vadi steppulesinappudu kotte vistels vestunnaru
    inkokademo rashtranni peelchi padeci unna boomulni ameesi andari daggara lakkoni vadi koduku factory ki isthadu
    inka evarikani votlu vestam emani vestam
    vote veyani vadaki aduge hakku ledantunnaru sare vesinvadu adigite answers evee


Leave a response

Your response:

Categories