Posted by: nagamurali | December 20, 2007

సొంతంగా రెండు శ్లోకాలు

tirupati.jpg

2001 లో కొన్ని నెలలపాటు రోజూ పది శ్లోకాలచొప్పున ‘శిశుపాలవధం’ కావ్యం చదివేను. దాన్నే మాఘకావ్యం అనికూడా అంటారు. అలా చదవడం కేవలం చాపల్యం, ఎందుకంటే అది మహా ప్రౌఢ కావ్యం. నేను పామరుణ్ణి. అయినా ’మాఘే సంతి త్రయో గుణా:’ అని ఎందుకంటారో తెలిసొచ్చింది.
(ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం
దండిన:పదలాలిత్యం మాఘేసంతి త్రయోగుణా: ||)

ఆ కావ్యంలో ఒకటి, మూడు సర్గలు మాత్రం మహానందాన్ని కలిగించాయి. అద్భుతమైన శ్లోకాలు. నాల్గవ సర్గనుంచి హటాత్తుగా మొత్తం మారిపోయింది. చాలా కఠినమైన భాష, అతి గహనమైన భావాలు – ఓహో, ప్రౌఢిమ అంటే ఇలా ఉంటుంది కాబోలు అనిపించింది. భాషతో సర్కస్ ఫీట్లు, జిమ్నాస్టిక్సు చేస్తున్నట్టనిపించింది.

ఏమైనా రోజూ పది శ్లోకాలు చదివినప్రభావం అనుకుంటా. మరీ ముఖ్యంగా ఒకటి, మూడు సర్గలవల్ల కలిగిన ఉత్సాహంతో నాకూ ఓ శ్లోకం రాద్దాము అనిపించింది. అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే నాకు వచ్చిన భాషా, వ్యాకరణమూ వగైరాలు ఇంచుమించుగా శూన్యం. అయినా మాఘుడు బుర్రలో దూరి ప్రేరేపించగా ఓరోజు ఆఫీసులో కూచుని రెండు శ్లోకాలు రాశాను. 2000 సంవత్సరం జనవరిలో ఓ పున్నమినాడు తిరుపతిలో జరిగిన దర్శనాన్ని వస్తువుగా తీసుకుని ఈ శ్లోకాలు.

నవాంబుద శ్యామ మనోఙ్ఞవల్లభం
అవాప్య రాగేణ సముద్ర సంభవా
అనిఛ్ఛతీవాస్తి భువం విలోకితుం
అత: సఏవాభవదద్రి పాలక: ||

సముద్రసంభవ అయిన లక్ష్మి కొత్త మేఘంవలె నల్లనై, అతిమనోహరుడైన ప్రియుణ్ణి చేరుకుని ఇంక భూమివైపు చూడడానికి ఇష్టపడడంలేదు. (మరి లక్ష్మి చూడకపోతే భూమికి వైభవం ఏమి ఉంటుంది?) అందుచేత మరి ఆయనే స్వయంగా భూమికి విచ్చేసి ఏడుకొండలవాడైనాడు.

ప్రభాతకాలే తవదర్శనాతురా:
పదం మయూఖై: శశిన: పరివృతం
అవాప్య స్నాతా: కలధౌత భాస్వరం
భవంతి నద్యాం తవ వైభవ శ్రియాం ||

తెల్లవారుజామున నీ దర్శనాతురులై వేచి ఉన్న జనులు చంద్ర కిరణాలతో ఆవృతమై బంగారు కాంతులతో ధగధగలాడుతున్న నీ పదాన్ని చేరుకుని నీ వైభవలక్ష్మి అనబడే నదిలో స్నానమాడుతున్నారు.

ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ సంస్కృతంలో వ్రాయడానికి మరి సాహసించలేదు.


Responses

  1. మొదటి పద్యం చాలా నచ్చింది(అంటే రెండోది బాగాలేదని కాదు సుమండీ :) ). వ్యాకరణం ఇత్యాది వాటిపై వ్యాఖ్యానించేటంత వాణ్ణి కాను కానీండి, పద్యంలోని భావం ఎంతో బాగుంది. ధన్యవాదాలు. మరిన్ని టపాలకై ఎదురుచూస్తుంటాను.

  2. అయ్యబాబోయ్ .. మీరెవరో అసాధ్యుల్లా ఉన్నారే! మీ బ్లాగు ఇన్నాళ్ళు ఎలా మిస్సయ్యాను చెప్మా? ఒకసారి కనక చూసుంటే సులువుగా మర్చిపోయే బ్లాగు కాదే! ఏదేమైనా, .. ఇలా పరిచయం కావటం బాగుంది. మీనించి మరిన్ని ఆసక్తికరమైన టపాలు ఆశిస్తూ.

  3. చాలా బావున్నాయండీ.

  4. శ్లోకాలు చాలా ప్రౌఢముగా వ్రాశారు. నా జీవితము నేను ఎప్పటికైనా చెయ్యదలచిన పనులలొ ఒకటి సంస్కృతము నేర్చుకోవడము. సంస్కృతములొ కొద్దిగా మాట్లాడము నేర్చుకొవడము. ఈశ్వరానుగ్రహము నాయందు ఉంటే సంస్కృతము నేర్చుకోగలను అని అనుకొంటున్నాను

  5. మీ నుండి మరిన్ని ఆశిస్తున్నాను

  6. పద్యాలు చాలా బాగున్నాయి. మొదటి పద్యం మరీ బాగుంది. పద విన్యాసం, చమత్కారం జగన్నాధ పండితరాయల శైలి ని గుర్తు తెచ్చింది.
    విరివిగా వ్రాయండి.
    అభినందనలు.

  7. ఇవాళ ఎలాగైనా మీ టపాలన్నీ పూర్తిచేయాలని…
    ఇటు కవిత్వాన్నీ, అటు సంస్కృతాన్నీ కలిపి మధించారే!
    బాసూ, సహబాసూ!

  8. [...] ఈయనెవరో అసాధ్యుడిలా ఉన్నాడే అని ఓ కొత్తపాళీ అనుకున్నట్టుగా మీరూ అనుకోకపోతే నా [...]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.