పద్యానికి చాలా శక్తి ఉంది అంటారు విశ్వనాథ సత్యనారాయణ. దాని విశేషాలు పూర్తిగా తెలియవు కానీ ఒకటి మాత్రం తెలుసు. పద్యం గుర్తుండిపోతుంది – ఒక్కోసారి శాశ్వతంగా. కొన్ని పద్యాలు అయితే రెండు మూడు సార్లు చదివితే చాలు, కంఠతా వచ్చేస్తాయి. చిన్నప్పుడు కథల పుస్తకాల్లో చదివిన పద్యాలు ఇప్పటికీ హఠాత్తుగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్లాగు కూడ ఉందిగా – అలా గుర్తొచ్చే పద్యాలూ, శ్లోకాలూ కొన్ని రాస్తూ ఉంటా.
చిన్నప్పుడు బాలజ్యోతిలో మహీధర నళినీమోహన్ గారి రచనలు చాలా ఇష్టపడి చదివేవాళ్ళం. ఆయన కథల పుణ్యమా అని కొన్ని పద్యాలు అలా గుర్తుండిపోయాయి.
ఇది తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయలమీద చెప్పిన పద్యం.
నరసింహ కృష్ణ రాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయంబై !
ఈ పద్యమైతే గుర్తుంది కానీ అర్ధం పూర్తిగా గుర్తు లేదు. కరి అంటే ఏనుగు. గిరి అంటే కొండ. భిత్ అంటే చంపినవాడు. ఈ మూడూ తిరగేసీ, బోర్లావేసీ ఆడుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఓ రోజు ఎలాగైనా పూర్తి అర్ధం పట్టుకుందామని గూగుల్లో వెతికితే ఈ లింకు దొరికింది.
http://www.maegabyte.com/RKSanka/telugu/purana_tenal.html
ఇదిగో ప్రతిపదార్థం:
నరసింహ కృష్ణరాయని
కరము – మిక్కిలి
అరుదగు – అరుదైన
కీర్తి యొప్పె – కీర్తి ఈ విధంగా ఒప్పుచున్నది
కరిభిత్ – ఏనుగును చంపినవానిలాగా (గజాసురుణ్ణి చంపిన శివునిలాగా)
గిరిభిత్ కరి – పర్వతాలను భేదించేవాడి (ఇంద్రుడి) ఏనుగు (ఐరావతం) లాగా
కరిభిత్ గిరి – శివుడుండే కొండ (కైలాసం) లాగా (కరిభిత్ అంటే శివుడు అని ముందే అనుకున్నాము కదా)
గిరిభిత్ – పర్వతాలను భేదించే వజ్రాయుధంలాగా (గిరిభిత్ అన్న ఒకే మాటకి ఇంద్రుడు, వజ్రాయుధం అని రెండు అర్ధాలు చెప్పుకోవాలి)
కరిభిత్ గిరిభిత్ తురంగ – శివుడి, ఇంద్రుడి అశ్వాల్లాగా (వాహనాల్లాగా) – అంటే నంది, ఉచ్చైశ్రవాల్లాగా
కమనీయంబై – కమనీయంగా ఉంది.
ఇవి అన్నీ తెల్లని వస్తువులు అనీ, కీర్తిని ఎప్పుడూ తెల్లని, శుభకరమైన వాటితో పోలుస్తారు అనీ తెలుసు కదా.
ఈ పద్యం అర్థం కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను.
ధన్యవాదములు..
By: shanmukhan on February 27, 2009
at 8:31 am
భలే పద్యం గురించి చెప్పారండి!
By: గోపాల్ on November 25, 2010
at 11:43 am
గుర్తుండిపోయే తెలుగు పద్యాలు
పద్యానికి చాలా శక్తి ఉంది అంటారు విశ్వనాథ సత్యనారాయణ. దాని విశేషాలు పూర్తిగా తెలియవు కానీ ఒకటి మాత్రం తెలుసు. పద్యం గుర్తుండిపోతుంది – ఒక్కోసారి శాశ్వతంగా. కొన్ని పద్యాలు అయితే రెండు మూడు సార్లు చదివితే చాలు, కంఠతా వచ్చేస్తాయి. చిన్నప్పుడు కథల పుస్తకాల్లో చదివిన పద్యాలు ఇప్పటికీ హఠాత్తుగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్లాగు కూడ ఉందిగా – అలా గుర్తొచ్చే పద్యాలూ, శ్లోకాలూ కొన్ని రాస్తూ ఉంటా.
చిన్నప్పుడు బాలజ్యోతిలో మహీధర నళినీమోహన్ గారి రచనలు చాలా ఇష్టపడి చదివేవాళ్ళం. ఆయన కథల పుణ్యమా అని కొన్ని పద్యాలు అలా గుర్తుండిపోయాయి.
ఇది తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయలమీద చెప్పిన పద్యం.
నరసింహ కృష్ణ రాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయంబై !
ఈ పద్యమైతే గుర్తుంది కానీ అర్ధం పూర్తిగా గుర్తు లేదు. కరి అంటే ఏనుగు. గిరి అంటే కొండ. భిత్ అంటే చంపినవాడు. ఈ మూడూ తిరగేసీ, బోర్లావేసీ ఆడుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఓ రోజు ఎలాగైనా పూర్తి అర్ధం పట్టుకుందామని గూగుల్లో వెతికితే ఈ లింకు దొరికింది.
http://www.maegabyte.com/RKSanka/telugu/purana_tenal.html
ఇదిగో ప్రతిపదార్థం:
నరసింహ కృష్ణరాయని
కరము – మిక్కిలి
అరుదగు – అరుదైన
కీర్తి యొప్పె – కీర్తి ఈ విధంగా ఒప్పుచున్నది
కరిభిత్ – ఏనుగును చంపినవానిలాగా (గజాసురుణ్ణి చంపిన శివునిలాగా)
గిరిభిత్ కరి – పర్వతాలను భేదించేవాడి (ఇంద్రుడి) ఏనుగు (ఐరావతం) లాగా
కరిభిత్ గిరి – శివుడుండే కొండ (కైలాసం) లాగా (కరిభిత్ అంటే శివుడు అని ముందే అనుకున్నాము కదా)
గిరిభిత్ – పర్వతాలను భేదించే వజ్రాయుధంలాగా (గిరిభిత్ అన్న ఒకే మాటకి ఇంద్రుడు, వజ్రాయుధం అని రెండు అర్ధాలు చెప్పుకోవాలి)
కరిభిత్ గిరిభిత్ తురంగ – శివుడి, ఇంద్రుడి అశ్వాల్లాగా (వాహనాల్లాగా) – అంటే నంది, ఉచ్చైశ్రవాల్లాగా
కమనీయంబై – కమనీయంగా ఉంది.
ఇవి అన్నీ తెల్లని వస్తువులు అనీ, కీర్తిని ఎప్పుడూ తెల్లని, శుభకరమైన వాటితో పోలుస్తారు అనీ తెలుసు కదా.
My comment: బాగుంది.
By: MALLIKARJUNA SHARMA on August 13, 2011
at 5:19 pm