Posted by: nagamurali | September 10, 2009

Men are from Mars and Women are from Venus

There are somethings about opposite sex which people realize only after marriage.

nemi

Posted by: nagamurali | September 9, 2009

Inglorious Basterds

Inglourious_Basterds_posterI am not a regular movie goer. The number of movies I watch in the theatre per year are generally no more than 2 or 3. Kottapali garu’s reference to Pulp Fiction in some of his blog posts intrigued me some time ago.  Later I happened to watch that movie in DVD. Man! What a mind numbingly brilliant movie it is! I might have watched parts of that movie nearly a hundred times by now. If that does not make me a fan of Quentin Tarantino, what else does?

Ever since I heard about the release of Inglorious Basterds, I have been longing to watch it. I read contradicting reviews about it in the London news papers. One reviewer praised it to heavens, but another said it is a very boring movie. In any case, I decided to watch it.

Finally the moment has come and I was full of expectations when I started watching it last night.  The movie has exceeded my expectations big time. Oh My God! What a movie! It is entertainment at its best! It is dark comedy at its best!  It is psychological drama at its best! It is absurdity at its best!

Hats off Christopher Waltz!

Hats off Tarantino! You, evil genius!

Let me warn all the gentle and pious souls who read my blog and especially the Telugu movie fans. Don’t watch this movie. I am going to hell for sure for enjoying Tarantino’s movies. Heed my warning and save your souls.

Posted by: nagamurali | August 5, 2009

ద్వితీయ విఘ్నం

ఓ శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో సంభాషణ.

“ఈ వారం (వారం అంటే మా దృష్టిలో వీకెండే) ఫలానా వాళ్ళింటికెళ్దామా?”

“గత వారం ఆ పని మొదలెట్టాను కదా. ఈ వారం మళ్ళీ బ్రేకొచ్చెయ్యదూ. ద్వితీయ విఘ్నం కూడాను. (మా ఊళ్ళో చిన్నప్పుడు ఒక పని మొదలెట్టాకా రెండో రోజు ఆపెయ్యకూడదు, ద్వితీయ విఘ్నం, అనేవారు. అందుకే శనివారాలు బళ్ళో వెయ్యడం, కొత్త పని మొదలెట్టడంలాంటివి చేసేవారు కాదు.)”

“అలాగా, పోనీ పైవారం వెళ్దామా?”

“అప్పుడు తృతీయ విఘ్నం వస్తుంది. అది కూడా కుదరదు”

“మరి ఆ పై వారం?”

“చతుర్థ విఘ్నం”

“తర్వాత?”

“పంచమ విఘ్నం”

అలా సంభాషణ సాగి, సాగి, పంచదశ(15), షోడశ(16), సప్తదశ(17), అష్టాదశ(18), ఏకోనవింశతి(19), వింశతి(20), దాకా సాగింది. ఇంకక్కణ్ణించీ రేండమ్ గా అంకెలు మొదలయ్యాయి.

“పోనీ ఇప్పటి నుంచీ ముప్ఫై మూడో వారం?”

“అప్పుడు త్రయోత్రింశత్తమ విఘ్నం వస్తుంది”

“నలభై నాలుగు?”

“చతుశ్చత్వారింశత్తమ విఘ్నం”

“యాభై ఏడు?”

“సప్తపంచాశత్తమ విఘ్నం”

“డెబ్భై ఎనిమిది?”

“అష్టసప్తతితమ విఘ్నం”

“తొంభై నాలుగు?”

“చతుర్నవతితమ విఘ్నం”

“రెండొందల యాభై ఆరు?”

“షట్ పంచాశదధిక ద్విశతతమ విఘ్నం”

అక్కడికి ఇంక అవతలి పార్టీకి ఓపిక నశించింది. ప్రయుతాలూ, అర్బుదాల దాకా వెళ్లడానికి నేను సిద్ధమైపోయాను.

“నీ బోడి పాండిత్యం నా దగ్గర ప్రదర్శించే బదులు వాళ్ళింటికి రావడం ఇష్టం లేదని చెప్పొచ్చుగా?”

“ఇంతసేపూ పరీక్షించి ఇప్పుడు బోడి పాండిత్యం అంటావా?” అని ముక్తాయించాను నేనూను.

Philip Ball రాసిన Critical Mass  పుస్తకంలో నాకు నచ్చిన ఒక nerdy joke.

ఎకనమిస్టులు ఈ జన్మలో సచ్ఛీలంతో, సత్ప్రవర్తనతో మెలిగి, తమ జ్ఞానాన్ని పదిమంది మంచి కోసం సద్వినియోగం చేసి, మంచి కర్మ సంపాదించుకుంటే – వచ్చే జన్మలో వాళ్ళు థీరెటికల్ ఫిజిసిస్టులై పుడతారు.

కానీ వాళ్ళు తమ జ్ఞానంతో జనాల్ని తప్పుదోవ పట్టించి దుష్మర్మ చేస్తే, వచ్చే జన్మలో సోషియోలజిస్టులై పుడతారు.

Posted by: nagamurali | August 2, 2009

The joy of finding the perfect software

Almost a year ago, I wanted to find out a suitable Java based CMS for some personal work. I did not have much idea about CMS at that time; was only thinking that it will be very similar to a wiki or the WordPress site. I had some very specific requirements. I wanted it to be open source, simple, small, customizable and extensible and what not! I started frantically searching and downloading and experimenting with a lot of Java based CMS softwares. But, they ALL turned out to be just rubbish. After a few weeks of intense searching I was vexed and abandoned the very idea of finding and using a CMS.

Many months passed and suddenly my interest was reignited a couple of months ago. I started the search again. This time I found some apparently fantastic softwares. But when I actually started experimenting with them, they turned out to be either white elephants or just useless pieces of shit. I am not able to comprehend why people spend their time and energy in writing shitty software – for no money! If writing shit gives money, that is another matter – which many of us happily do. But, what is the point in developing some huge and fancy open source softwares, which turn out to be total junk? Are these guys making any money out of these FREE open source softwares in any way? Doesn’t the project manager ever use or test the features of these softwares?  This is what I am not able to get my head around.

Anyway, the good news is I found my perfect software last night. There is some guy, somewhere in the world who knew exactly what I want. He has literally crystallized my dream into a little CMS and put it in the internet for me to download.

After all this effort, I can now tell what is shit and what is useful among the Java based CMSs. That qualifies me to be a consultant in this sphere, doesn’t it?

ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్: “కీలుబొమ్మల చేతిలో దేశం అనాథ” ఆవేదనాభరితంగా ఉంది. (దీని మీద ఎంతైనా చర్చించొచ్చు. కానీ ప్రస్తుతం చర్చల్లో తలదూర్చే ఆసక్తి లేదు.) మన దేశానికి “బలమైన నాయకత్వం” వస్తుందని ఆశ పడడానికి ప్రస్తుతానికి ఏమీ ఆధారం కనిపించదు.

ఎక్కడికి పోతోందో తెలియని రైల్లో కూర్చున్న ప్రయాణీకులు భారతీయులు. గమ్యం గురించి వాళ్ళకి పట్టింపు లేదు. ఆ రైలుని నడిపే వాళ్ళకి కూడా ఎక్కడికి పోవాలో తెలియదు.

పై వ్యాసం కిందనే రామచంద్ర గుహ రాసిన మరో వ్యాసం – లాహోర్ నగరం గురించి ఒక పాకిస్థానీ చరిత్రకారుడు రాసిన ఒక పుస్తకం గురించి. రామచంద్ర గారూ, అది పాకిస్థాన్. ఇండియా కాదు. అక్కడ రొమిల్లా థాపర్లకూ, రామచంద్ర గుహలకూ స్థానం లేదు.

పై రెండు వ్యాసాలూ ఒకదానికొకటి కాంట్రాస్టింగ్ గా పక్కపక్కనే ఉండడం చూసి నవ్వొచ్చింది.

(ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో ఉటంకించిన విషయం: ‘రెండవ ప్రపంచ యుద్ధపు చరిత్ర గురించి రష్యా ఆందోళన’. దాని  గురించి బీబీసీ న్యూస్ ఐటం ఇక్కడ).

Posted by: nagamurali | June 29, 2009

మల్లినాథ సూరి

(చిన్నప్పుడు బాలజ్యోతిలో చదివిన మహీధర నళినీమోహన్ గారి కథ ఆధారంగా.)

అనగా అనగా ఒక మహా పండితుడు. ఆయనకొక పుత్రుడు. అతను అక్షరాలా పండిత పుత్రుడు. పేరు మల్లినాథుడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తండ్రి గారాబంగా పెంచాడు. దాంతో మల్లినాథుడు చదువుకి మొండికేసి అక్షరమ్ముక్క కూడా నేర్చుకోకుండా అల్లరి చిల్లరగా పెరిగాడు. పెళ్ళీడు వచ్చింది. వేరే ఊరిలోని పండిత కుటుంబంలోని పిల్లని తెచ్చి పెళ్ళి చేశారు. తండ్రిగారి కీర్తి తప్ప కుమారుడి ప్రతిభ గురించి తెలియక ఆ పిల్ల కుటుంబం పెళ్ళికి ఒప్పుకుంది. మధ్యలో మసిపూసి మారేడుకాయ చేసే పేరయ్యలు ఉండనే ఉంటారుగా.

పెళ్ళి తంతులు పూర్తయ్యాకా అత్తవారి ఇంటికి వెళ్ళాడు మల్లినాథుడు. వెళ్ళే ముందే కొడుక్కి కొన్నిజాగ్రత్తలు చెప్పాడు తండ్రి. ‘ఒరే అబ్బాయీ, మీ మామగారూ, బావ మరుదులూ అంతా మంచి పండితులు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ గ్రంథాలూ అవీ చూపించి గోష్టి మొదలుపెడతారు. సాధ్యమైనంతవరకూ తప్పించుకో. ఏదైనా పుస్తకం చూపిస్తే, “గ్రంథకర్త ఎవరూ? ఈ భాష్యకారుడితో మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి”, ఇలా ఏదో దబాయించు సుమా’ అని సలహా ఇచ్చాడు.

మనవాడికి అత్తవారి ఇంటిలో రాచమర్యాదలు జరుగుతున్నాయి. అంత పెద్ద పండితుడి కొడుకు వచ్చాడని ఊరు ఊరంతా వచ్చి చూసి వెడుతోంది. మల్లినాథుడి భార్యకి గర్వంగా ఉంది. మల్లినాథుడు ఏవో పనులు కల్పించుకుని చర్చాగోష్టుల ప్రసక్తి రానియ్యకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సాప్ట్ వేర్ ఇంజనీరుకి పెళ్ళయి, సాప్ట్ వేర్లో పని  చేస్తున్న బావమరుదులు ఉంటే ఊరుకుంటారా? ‘బావా, జావా’ అంటూ ఏవో కబుర్లు మొదలుపెట్టరూ! అలాగే మల్లినాథుణ్ణి కూడా బలవంతాన అతని బావమరుదులు వాళ్ళ పుస్తకాల గదిలోకి లాక్కెళ్ళి వాళ్ళ పుస్తకాలు అన్నీ చూపిస్తున్నారు. మనవాడు, ‘ఇలాంటి చచ్చు పుస్తకాలు మేం చాలా చూశాం లేమ్మా’ అన్నట్టుగా పోజిచ్చి ఏదో దబాయిస్తున్నాడు. వాళ్ళావిడ కూడా సరదాపడి వచ్చి అక్కడే కూర్చుని అంతా వింటోంది.

మల్లినాథుడు వాళ్ళ అలమారులో ఏదో దుక్కలాటి పుస్తకం కనపడితే దాన్ని తీసి, ‘ఇది ఏ గ్రంథం?’ అని అడిగాడు. ‘అది అలిఖితం’ అన్నారు బావమరుదులు. ‘అలాగా, ఎవరు రాశారు?’ అన్నాడు. వాళ్ళు గొల్లున నవ్వారు. ఇతనికి ఏమీ తెలియదని వాళ్ళకీ, అతని భార్యకీ అనుమానం వచ్చింది.

మర్నాడు పొద్దున్న అతని మామగారు పిలిచి, ‘నాయనా, పూజకి వేళవుతోంది. ఏమైనా పూలు తీసుకురా’ అని పంపించారు. (నేనైతే, ‘అల్లుడికి పని చెప్పడమేమిటండీ, ఠాట్’ అని ఎగిరేసి సైలెంటుగా ఇంటికొచ్చేద్దును.) పాపం ఆ వెర్రివాడు ఊళ్ళోకి పోయి ఎదురుగా ఎర్రటి పూల చెట్టు ఒకటి కనబడితే, దాన్ని ఎక్కి బోలెడన్ని పూలు కోసుకుని తీసుకువచ్చాడు. తీరా చూస్తే అవి మోదుగ చెట్టు పూలు. పూజలకి పనికిరావు. బావగారి నిర్వాకం చూసి బావమరుదులు పడీ, పడీ నవ్వారు. మామగారు తెల్లబోయాడు.

అప్పుడు మల్లినాథుడి భార్య (ఆవిడ కూడా మంచి జావా ప్రోగ్రామరే) మొగుణ్ణి చూసి ఒక శ్లోకం చెప్పిందిట.

రూప యౌవన సంపన్నం

గుణ శీల సమన్వితం

విద్యాహీనం న శోభన్తే

పాలాశ కుసుమం యథా||

ఒక మనిషి మంచి అందగాడు కావచ్చు, వయసులో ఉండి ఉండవచ్చు. మంచి గుణాలూ, సత్ప్రవర్తనా కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ అతనికి జావా రాకపోతే ఆ గుణాలేమీ శోభించవు- మోదుగ చెట్టు పువ్వుల్లాగా. (మోదుగ చెట్టు పూలు కూడా ఎర్రగా బాగుంటాయి, కానీ వాసన ఉండదుట.)

దాంతో మల్లినాథుడికి అహం దెబ్బతింది. వెంటనే అదే క్షణంలో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళడం, వెళ్ళడం నవద్వీపం వెళ్ళిపోయాడు. పన్నెండేళ్ళు ఇల్లూ, ఒళ్ళూ మర్చిపోయి కఠోర శ్రమ చేసి మహా సంస్కృత పండితుడయ్యాడు. గెడ్డాలు పెరిగిపోయి సన్యాసి రూపం వచ్చింది. చదువు పూర్తయ్యాకా మళ్ళీ అత్తవారి ఊరు వెళ్ళాడు. తిన్నగా అత్తవారి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు.

ఎవరో మహా తేజస్వి మన ఇంటికి పిలకుండానే వచ్చాడని సంబరపడి అతని అత్తా, మామగారూ ఇంట్లోకి రమ్మని సపర్యలు చేసి భోజనానికి కూర్చోమన్నారు. అతని భార్యే వడ్డన మొదలు పెట్టింది. పాపం శోకం మూర్తీభవించినట్టుగా ఉందామె. పరధ్యానంగా ఉంది. చారు వడ్డించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు మల్లినాథుడు. వెంటనే ఒక శ్లోకం చెప్పాడు -

చారు చారు సమాయుక్తం

హింగు జీర సమన్వితం

లవణ హీనం న శోభన్తే

పాలాశ కుసుమం యథా ||

‘చారు చాలా అందంగా ఇంగువ, జీలకర్రలతో కలిపి చెయ్యబడింది. కానీ  ఉప్పు లేకుండా అవేవీ శోభించవు – మోదుగచెట్టు పువ్వుల్లాగే’ అని ఆ శ్లోకానికి అర్థం. మల్లినాథుడి భార్యకి దిమ్మతిరిగింది. తేరిపార చూసి, గెడ్డం వెనకాల ఉన్నది తన భర్తే అని గ్రహించింది. ఆవిడ ఆనందానికి అవధుల్లేవు.

మల్లినాథుడు మన తెలుగువాడే. సంస్కృత మహాకావ్యాలకి ఆయన రాసిన వ్యాఖ్యలు జగత్ప్రసిద్ధాలు. ‘మాఘే, మేఘే గతం వయ:’ అని ఆయన చెప్పుకున్నాడుట.  అంటే, మాఘ కావ్యానికీ, మేఘ కావ్యానికీ (మాఘుడు రాసిన శిశుపాలవధకీ, కాళిదాసు రాసిన మేఘసందేశానికీ) వ్యాఖ్య రాయడంలో తన వయస్సు అంతా అయిపోయిందని దాని భావం.

(కోలాచల మల్లినాథ సూరి వంశంలో పుట్టిన ఒకాయన్ని నా అదృష్టం కొద్దీ కలుసుకోగలిగాను. ఆయనా గొప్ప పండితుడే. తెలుగు భాషా, సాహిత్యాల్లో అంతర్జాలంలో ఆయన చేస్తున్న కృషి అందరికీ తెలిసినదే.)

నా బ్లాగు టపాలు ఇకపై కూడలి మెయిన్ పేజీలో కనిపించవు. సాహిత్యం పేజీలో మాత్రమే కనిపిస్తాయి.

ప్రవృద్ధమంద్రాంబుదధీరనాదః
కృష్ణార్ణవాభ్యర్ణచరైకహంసః
మందానిలాపూరకృతం దధానో
నిధ్వానమశ్రూయత పాంచజన్యః ||

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితం గురించి హైస్కూల్లో ఒక నాండిటేల్డ్ పాఠ్య పుస్తకం ఉండేది. అందులో చదివాను. ఆయనని చిన్నతనంలో గీతగోవిందంలోని ‘నిభృత నికుంజ గృహం’ అన్న పదం (సమాసం) చాలా ఆకర్షించిందిట. సంస్కృత కావ్యాలు చదివితే కొన్ని అందమైన పదాలూ, పదచిత్రాలూ మన మనస్సులో చెరగని ముద్రలు వేస్తాయి. కవులు ఆ పదాల కూర్పుని ఎలా చేశారో కదా అనిపిస్తుంది. అంతకన్నా అందంగా పదాల్ని సృష్టించడం, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యడం సాధ్యం కాదనిపిస్తుంది. అందుకే కదా ‘నానృషిః కురుతే కావ్యం’ అన్నది!!

ఇంక అసలు విషయానికొస్తే పైన చెప్పిన శ్లోకం చూడండి. అందులోని ‘కృష్ణార్ణవాభ్యర్ణ చరైక హంస’ అన్న సమాసం నాకు చాలా ఇష్టమైనది. మాఘకావ్యం మూడో సర్గలోది ఈ శ్లోకం. ఆ సమాసానికి అర్థం ఏమిటంటే, ‘కృష్ణుడు అనబడే సముద్రానికి దగ్గర్లో తిరుగాడుతూ ఉండే ఒకానొక హంస’ అని. శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యాన్ని వర్ణిస్తూ మాఘుడు చేసిన గొప్ప ఊహ ఇది. భావన చేసే కొద్దీ ఈ సమాసం, ఇందులోని అలంకారం, పదాల కూర్పు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుస్తుంది.

అర్థాలు చూడండి -

ప్రవృద్ధ మంద్ర అంబుద ధీర నాదః – వర్షాకాలంలో కనిపించే గొప్ప మేఘం యొక్క మంద్రమైన, గంభీరమైన ధ్వని కలిగినదీ

కృష్ణ అర్ణవ అభ్యర్ణ చర ఏక హంసః – శ్రీకృష్ణుడనే సముద్రానికి దగ్గరలో తిరుగాడుతూ ఉండే ఒకానొక హంస

పాంచజన్యః – (అయినట్టి) పాంచజన్యమనే శంఖం

మంద అనిల ఆపూరకృతం నిధ్వానం దధానః – మెల్లగా వీచే గాలి చేత పూరించబడుతున్న ధ్వనితో

అశ్రూయత – వినిపించెను.

కామేశ్వరరావు గారూ, ఈ శ్లోకానికి మీ తెలుగు అనువాదం కోసం ఎదురు చూస్తాను. అక్షరలక్షలు ఇవ్వలేను గానీ మనం కలుసుకున్నప్పుడు తప్పకుండా అక్షరానికో పకోడీయో, మరేదైనా మీకిష్టమైనదో సమర్పించుకుంటాను.

భైరవభట్ల కామేశ్వరరావు గారి సమాధానం, అనువాదం:

“అంతకన్నా అందంగా పదాల్ని సృష్టించడం, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యడం సాధ్యం కాదనిపిస్తుంది.”, అని కూడా నన్ను అనువాదించమన్నారే!
కొన్ని పద్యాలు అర్థ ప్రధానమైనవి ఉంటాయి. వాటిని అనువదించడం కొంత సులువు. మరికొన్ని శబ్ద ప్రథానమైనవి. వాటిని అనువదించడం అనవసరం. కొన్ని మాత్రం శబ్దార్థ సమప్రాధాన్యం కలిగినవి ఉంటాయి. వాటిని అనువదిస్తే బావుంటుందనిపిస్తుంది. కాని అనువదించడం చాలా కష్టం. ఈ శ్లోకం అలాంటిది! ఆ పదాలు, పదాల సంయోజనం, భావాన్ని ఎంతగానో ప్రకాశింపజేస్తున్నాయి!

“ప్రవృద్ధమంద్రాంబుదధీరనాదం” ఆ శ్లోకంలో వినిపిస్తోంది.

అయినా మనసు ఊరుకోదు కదా. ఏదో ప్రయత్నించాను.

ప్రావృడంబుద మంద్ర ధీరస్వనంబు
సెలగ, కృష్ణాంబునిధి వియత్తల విహార
హంస మందానిలోంభిత మగుచు దిశల
మ్రోగె నదె పాంచజన్యంబు మోహనంబు!
మ్రోగె నదె పాంచజన్యంబు మోక్షదంబు!

Older Posts »

Categories